Headlines

Vaibhav Sooryavanshi: 10 సిక్సర్లు, 9 ఫోర్లు.. దులీప్ ట్రోఫీలో వైభవ్ సూర్యవంశీ విధ్వంసం


Vaibhav Sooryavanshi: ప్రస్తుతం భారత క్రికెట్‌లో ఎక్కడ చూసినా 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ పేరు మార్మోగిపోతోంది. మొదట ఐపీఎల్, ఆ తర్వాత ఇండియా-ఎ, అండర్-19 వరల్డ్ కప్‌లలో తన విధ్వంసకర బ్యాటింగ్‌తో ఆకట్టుకున్న ఈ కుర్రాడు, ఇప్పుడు రెడ్ బాల్ ఫార్మాట్‌లో ప్రతిష్ఠాత్మక దులీప్ ట్రోఫీలోనూ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఈస్ట్ జోన్ తరఫున సెంట్రల్ జోన్‌తో జరుగుతున్న సెమీఫైనల్ పోరులో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ అద్భుతమైన షాట్లతో మైదానాన్ని హోరెత్తించాడు.

రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 132 పరుగుల ఊచకోత

ఈ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌లో వైభవ్ 92 పరుగుల మైండ్ బ్లాకింగ్ ఇన్నింగ్స్ ఆడి త్రుటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో 7 ఫోర్లు, 7 సిక్సర్లు బాదిన ఈ సంచలనం, రెండో ఇన్నింగ్స్‌లో కూడా అదే జోరు కొనసాగించి 43 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 40 పరుగులు సాధించాడు. ఇలా రెండు ఇన్నింగ్స్‌లు కలిపి మొత్తం 10 సిక్సర్లు, 9 ఫోర్లతో 132 పరుగులు రాబట్టి క్లిష్టమైన సమయంలో జట్టును ఆదుకున్నాడు.

దులీప్ ట్రోఫీ చరిత్రలోనే సరికొత్త రికార్డు

ఈ తుఫాన్ ఇన్నింగ్స్ ద్వారా దులీప్ ట్రోఫీ చరిత్రలోనే అత్యంత పిన్న వయసులో హాఫ్ సెంచరీ పూర్తి చేసిన బ్యాటర్‌గా వైభవ్ అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. కేవలం 15 ఏళ్ల 157 రోజుల వయసులోనే ఈ ఘనత సాధించాడు. ఇన్నింగ్స్ మొదలైన మొదటి 15 ఓవర్లలోనే 42 బంతుల్లో సిక్సర్ కొట్టి తన అర్ధశతకాన్ని పూర్తి చేశాడు. గతంలో లక్ష్మణ్ సింగ్ (16 ఏళ్ల 23 రోజులు), పీయూష్ చావ్లా (16 ఏళ్ల 307 రోజులు) నెలకొల్పిన రికార్డులను వైభవ్ తుడిచిపెట్టేశాడు.

కెప్టెన్సీ, డీఆర్ఎస్ డ్రామాతో మెరిసిన వైభవ్

కేవలం బ్యాటింగ్‌తోనే కాకుండా మైదానంలో తన చాకచక్యంతోనూ వైభవ్ అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈ మ్యాచ్ తొలి రోజున ఈస్ట్ జోన్ జట్టుకు కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తించిన ఆయన, గ్రౌండ్‌లో తీసుకున్న ఒక డీఆర్ఎస్ నిర్ణయం మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. వైభవ్ రివ్యూ కోరడంతో అంపైర్ తన నిర్ణయాన్ని మార్చుకోవాల్సి వచ్చింది. 15 ఏళ్ల చిన్న వయసులోనే ఆటపై ఇంతటి పట్టు ప్రదర్శించడం పట్ల మాజీ క్రికెటర్లు ముచ్చటపడుతున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *