
Maharashtra: ఎట్టకేలకు చిక్కిన మ్యాన్ ఈటర్
భర్త బండిలో నుంచి ఎరువులను దించుతుండగా.. భార్య పొలంలోకి వెళ్లింది. ఇంతలో పొలంలో నక్కి ఉన్న పులి ఒక్కసారిగా మహిళపై దాడి చేసింది. పొలం పక్కన ఉన్న సరస్సు ఒడ్డుకు ఆమెను లాక్కెళ్లింది. మహిళ అరుపులు విని ఆమె భర్త, ఇతర కూలీలు పరుగు పరుగున అక్కడికి చేరుకున్నారు. జనం అలికిడి విని పులి పారిపోయింది. అయితే, పులి దాడిలో తీవ్రంగా గాయపడిన మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికుల సమాచారంతో పోలీసులు, అటవీశాఖ అధికారులు వెంటనే…