ఆ పేరు వెనుక ఉద్యమ స్ఫూర్తి.. జెన్ జీకి దగ్గరయ్యేందుకు జనసేన కీలక నిర్ణయం..
‘చేయెత్తి జైకొట్టు తెలుగోడా..’..తెలుగు ప్రజల్లో చైతన్యాన్ని రగిలించిన గేయంలోని ఈ పిలుపు.. ఇప్పుడు జనసేన యువజన విభాగం పేరుగా మారింది. పార్టీ ఆవిర్భవించి పన్నెండేళ్లు దాటిన తర్వాత.. జనసేన తొలిసారిగా ప్రత్యేక యువజన విభాగాన్ని ఏర్పాటు చేసింది. ‘జై కొట్టు’ పేరుతో ఏర్పాటు చేసిన ఈ విభాగాన్ని పవన్ కల్యాణ్ జన్మదినం సందర్భంగా బుధవారం పిఠాపురంలో ఆవిష్కరించారు. వాస్తవానికి.. 2014 మార్చి 14న జనసేన ఆవిర్భవించింది. పార్టీ ప్రస్థానంలో యువత మొదటి నుంచీ కీలకంగా ఉంది. సభలు,…