
యూఎస్‌లో గందరగోళం.. ప్రయాణాలు కేన్సిల్ చేసుకుంటున్న భారతీయులు వీడియో
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీసుకున్న ఒక ఆకస్మిక నిర్ణయం అమెరికాలోని ప్రవాస భారతీయులను తీవ్ర ఆందోళనలో ముంచెత్తింది. H-1B వీసా రుసుమును లక్ష డాలర్లకు పెంచుతున్నట్లు ట్రంప్ ప్రకటించడంతో అమెరికాలో గందరగోళం నెలకొంది. ఈ కొత్త నిబంధన ఆదివారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి రావడంతో అమెరికా విమానాశ్రయాల్లో శుక్రవారం నుంచే అలజడి మొదలైంది. అమెరికాను విడిచి స్వదేశాలకు వెళ్లి తిరిగి రావాలంటే భారీగా రుసుము చెల్లించాల్సి ఉంటుందనే భయంతో చాలా మంది తమ ప్రయాణాలను రద్దు…