AP Inter Results 2026: 12 ఏళ్లలో అత్యధిక ఉత్తీర్ణత.. ఇంటర్‌ విద్యార్ధులకు మంత్రి లోకేష్‌ అభినందనలు!

AP Inter Results 2026: 12 ఏళ్లలో అత్యధిక ఉత్తీర్ణత.. ఇంటర్‌ విద్యార్ధులకు మంత్రి లోకేష్‌ అభినందనలు!


అమరావతి, ఏప్రిల్ 15: ఈ రోజు విడుదలైన ఇంటర్ ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించిన రాష్ట్ర ఇంటర్‌ విద్యార్ధులకు మంత్రి లోకేష్‌ శుభాకాంక్షలు తెలిపారు. నేటి ఉదయం ఎక్స్‌ వేదికగా ఇంటర్‌ ఫలితాలు వెల్లడించిన ఆయన ఈ మేరకు అభినందనలు తెలిపారు. ఈ ఏడాది ఇంటర్ ఫలితాల్లో గరిష్ఠ ఉత్తీర్ణత నమోదైందని, గత 12 సంవత్సరాలలో ఎన్నడూలేని విధంగా అత్యధిక ఉత్తీర్ణత శాతాన్ని విద్యార్ధులు సాధించినట్లు మంత్రి నారా లోకేష్‌ ఆనందం వ్యక్తం చేశారు. ఇంటర్ ప్రథమ సంవత్సరంలో 77 శాతం, ద్వితియ సంవత్సరంలో 81 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు ఆయన తెలిపారు. ఇది గత 12 ఏళ్లలోనే అత్యధికం. రెండో సంవత్సరం విద్యార్థుల ఉత్తీర్ణత శాతం 68%గా ఉండి, ఇది గత 12 ఏళ్లలో రెండవ అత్యుత్తమ ఫలితం. ముఖ్యంగా ప్రభుత్వ, ప్రభుత్వ-నిర్వహణ సంస్థలలో చదువుతున్న విద్యార్ధులు గణనీయంగా ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు.

ఏపీ ఇంటర్ ఫలితాల 2026 కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో (జీజేసీ)లో ఫస్ట్‌ ఇయర్‌ విద్యార్థుల ఉత్తీర్ణత శాతం 54%గా ఉంది. ఇది గత 12 సంవత్సరాలలో అత్యధికం. సెకండ్‌ ఇయర్‌కి ఉత్తీర్ణత శాతం 68%గా ఉంది. ఇది కూడా గత 12 సంవత్సరాలలో రెండవ అత్యధిక పనితీరును సూచిస్తుందని తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ విజయం విద్యార్థులు, ప్రిన్సిపాళ్లు, జూనియర్ లెక్చరర్లు, విద్యా రంగంలో ఉన్న ప్రతి ఒక్కరి కృషికి నిదర్శనం.

ఈసారి విజయాన్ని అందుకోలేకపోయిన విద్యార్థులు నిరుత్సాహపడకండి. దీన్ని ఒక పాఠంగా తీసుకుని మరింత కష్టపడి మళ్లీ బలంగా ముందుకు రండి. ఈ సున్నిత సమయంలో విద్యార్థులకు తల్లిదండ్రులు, కళాశాలలు, సమాజం మొత్తం మానసికంగా తోడుగా నిలవాలని కోరుకుంటున్నాను. అందర విద్యార్థులకు భవిష్యత్తు కోసం హృదయపూర్వక శుభాకాంక్షలు. మీరు మరింతగా నేర్చుకుంటూ, అభివృద్ధి చెందుతూ, విజయాలను సాధించాలి… అంటూ మంత్రి లోకేష్‌ ట్వీట్‌లో తెలిపారు.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *