Sakib Hussain : ఐపీఎల్ 2026 సీజన్‌లో సంచలన బౌలింగ్‌తో దూసుకుపోతున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) యువ పేసర్ సాకిబ్ హుస్సేన్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన తన అరంగేట్రం మ్యాచ్‌లోనే 4 వికెట్లు పడగొట్టి తన సత్తా ఏంటో ప్రపంచానికి చాటాడు. అయితే, ఈ స్థాయికి చేరుకోవడానికి సాకిబ్ పడిన కష్టాలు, చేసిన పోరాటం కన్నీళ్లు తెప్పిస్తాయి. ముఖ్యంగా కేవలం 500 రూపాయల కోసం అతను తన కోచ్‌తోనే అబద్ధం చెప్పిన ఉదంతం ఇప్పుడు వైరల్ అవుతోంది.
సాకిబ్ హుస్సేన్ కోచ్ సౌరభ్ కుమార్ (రాబిన్ సర్) ఒక ఇంటర్వ్యూలో సాకిబ్ పడిన కష్టాలను పంచుకున్నారు. బిహార్ క్రికెట్ లీగ్ (BCL) ప్రారంభమైన సమయంలో, ఒక మంచి బౌలర్ కావాలని కోచ్ అశోక్ కుమార్ అడిగితే.. రాబిన్ సర్ ఏకంగా జిల్లా స్థాయి కూడా ఆడని సాకిబ్ పేరును సూచించారు. “సాకిబ్ మీద నాకు నమ్మకం ఉంది, అతను విఫలమైతే నేను గ్రౌండ్‌లో అడుగు పెట్టను” అని రాబిన్ సవాల్ చేశారు. కానీ సాకిబ్‌కు ఫోన్ చేసి రమ్మంటే, “నేను రాలేను సర్, మా అక్కను తీసుకురావడానికి వెళ్లాలి” అని అబద్ధం చెప్పాడు. అసలు విషయం ఏంటంటే, పక్క ఊర్లో టెన్నిస్ బాల్ మ్యాచ్ ఆడితే అతనికి 500 రూపాయలు వస్తాయి. ఆ డబ్బుల కోసమే ఐపీఎల్ వంటి పెద్ద అవకాశానికి దారి చూపే లీగ్‌ను వదులుకోబోయాడు.
సాకిబ్ పరిస్థితి ఎంత దారుణంగా ఉండేదంటే.. గోపాల్‌గంజ్ నుంచి పాట్నాకు వెళ్లడానికి కూడా అతని దగ్గర డబ్బులు లేవు. అతని స్నేహితుడు ప్రిన్స్ బైక్ మీద పాట్నాలో దించి వెళ్లాడు. స్టేడియం వరకు వెళ్లడానికి రాబిన్ సర్ డబ్బులు ఇచ్చారు. కనీసం బౌలింగ్ చేయడానికి సరైన షూలు కూడా అతని దగ్గర లేవు. టీమ్‌లోని శబ్బీర్ అనే ఆటగాడి షూలను అద్దెకు తీసుకుని ఆడాడు. ఆ తర్వాత రాబిన్ సర్ ఒక స్పోర్ట్స్ షాపులో షూలు కొనిపించారు. బిసిఎల్‌లో సాకిబ్ వేగం చూసి కోచ్ అశోక్ కుమార్ ఆశ్చర్యపోయి, ఎక్కడి నుంచి తెచ్చావు ఈ వజ్రాన్ని? అని రాబిన్ సర్‌కు ఫోన్ చేసి మెచ్చుకున్నారు.
తన తల్లి నగలు అమ్మి మరీ సాకిబ్ క్రికెట్ కలను ప్రోత్సహించిన కథ ఇప్పటికే ఫ్యాన్స్‌కు తెలుసు. ఇప్పుడు ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ వంటి దిగ్గజ జట్టుపై 4 వికెట్లు తీసి సన్‌రైజర్స్‌కు అద్భుత విజయాన్ని అందించాడు. కనీసం 500 రూపాయల కోసం ఇబ్బంది పడిన ఒక కుర్రాడు, ఈరోజు కోట్ల మంది అభిమానుల మనసు గెలుచుకోవడం నిజంగా స్ఫూర్తిదాయకం. భవిష్యత్తులో భారత జట్టుకు కూడా సాకిబ్ ఒక కీలక బౌలర్‌గా మారుతాడని విశ్లేషకులు భావిస్తున్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..