కావాల్సిన పదార్థాలు: ఒక కప్పు మునగాకు ఆకులు, రెండు ఉల్లిపాయలు, 4 పచ్చిమిర్చి , 5 వెల్లుల్లి రెబ్బలు , నిమ్మకాయంత చింతపండు, రుచికి సరిపడా ఉప్పు , ఒక టేబుల్ స్పూన్ కారం, రెండు టేబుల్ స్పూన్స్ నూనె, అర టేబుల్ స్పూన్స్ ఆవాలు, ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు, 4 ఎండు మిర్చిని తీసుకోవాలి.
ముందుగా పాన్లో మూడు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి కట్ చేసిన పచ్చిమిర్చి, నాలుగు వెల్లుల్లి, కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసి మారే వరకు బాగా వేయించాలి.
ఇవి మెత్తగా అయిన తరవాత మునగాకు ఆకులు వేసి 10 నిమిషాల పాటు బాగా వేయించాలి. ఆ తరువాత చింతపండు వేసి మరో 2 నిమిషాలు కలపాలి. ఆ స్టవ్ ఆఫ్ చేసి దానిని ఫ్యాన్ కింద ఆరనివ్వాలి.
ఇప్పుడు మిక్సీలో కానీ, రోటిలో కానీ దీనినిం వేసి రుచికి సరిపడా ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ కారం వేసి మెత్తగా ముద్దలాగా నూరుకోవాలి.
ఆ తరువాత చిన్న పాన్ తీసుకుని ఆయిల్ వేసి పోపు పెట్టుకోవాలి.
హాస్పిటల్స్ కి వేలు పెట్టే బదులు పెరట్లో ఫ్రీ గా దొరికే ఈ ఆకుతో పచ్చడి తింటే ఎంతో నయం. ఇంకా చెప్పాలంటే ఇది ఆరోగ్యకరమైనది కూడా. ఈ పచ్చడిని మీరు ఒకసారి వేడి అన్నంతో తింటే రోజూ చేసుకుని తింటారు అంత టేస్టీగా ఉంటుంది.




