Headlines

రూ.4 వేల కోట్ల సినిమా.. అలా వదిలేసారేంటి బాసూ..?


భారతదేశంలోనే అత్యంత ఖరీదైన చిత్రంగా చెబుతున్న రామాయణ సినిమా విడుదల తేదీకి కేవలం 60 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. రూ.4 వేల కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రమోషన్ల విషయంలో మాత్రం చిత్రబృందం ఆశ్చర్యకరమైన నిశ్శబ్దాన్ని పాటిస్తోంది. వంద కోట్ల చిత్రాలకే నిర్మాతలు పెద్ద ఎత్తున హడావిడి చేస్తుంటే, రామాయణ వంటి భారీ ప్రాజెక్ట్‌కు ఇంత మౌనం ఎందుకు అన్న చర్చ జరుగుతోంది.ఈ మౌనం ప్రమోషన్స్‌లో భాగమా, లేక చిత్రబృందం రహస్యంగా ఏదైనా ప్రణాళికను అమలు చేస్తోందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో “టాక్సిక్” చిత్రం విడుదల కారణంగా ప్రమోషన్లు నిలిచిపోయాయని భావించినా, ఇప్పుడు కూడా అదే నిశ్శబ్దం కొనసాగడం గమనార్హం. కేవలం ట్రైలర్ లాంచ్ చేసి చేతులు దులుపుకున్నారని మేకర్స్‌పై వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.భారీ బడ్జెట్‌ ఉన్నప్పుడు ఒత్తిళ్లు కూడా అలాగే ఉంటాయని, రామాయణకు అనుకున్న స్థాయిలో బిజినెస్ జరగడం లేదని తెలుస్తోంది. ముఖ్యంగా “టాక్సిక్” చిత్రం ఫలితం ఈ సినిమా బిజినెస్‌పై ప్రభావం చూపిందని, “టాక్సిక్” విజయం సాధించి ఉంటే రామాయణ బిజినెస్ వేరే స్థాయిలో ఉండేదని టాక్ నడుస్తోంది. అందుకే ప్రమోషన్లను ఆలస్యం చేస్తున్నా, సరైన సమయం కోసం బృందం ఎదురుచూస్తోందని తెలుస్తోంది.

మరిన్ని వీడియోల కోసం :

ముస్తాబైన ఖైరతాబాద్‌ గణపయ్య.. పంచముఖ సంకటహర మహా గణపతిగా దర్శనం

పాముల్నే తింటుంది..దీని స్పెషాలిటీస్ తెలిస్తే షాక్.. అందుకే ఇది కింగ్ కోబ్రా

పెన్షన్ లేని వారికి గుడ్ న్యూస్! సెప్టెంబర్ 7-16 వరకు దరఖాస్తులు..ఏఏ పత్రాలు కావాలో తెలుసా?

తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్, ఉరుములు,మెరుపుల బీభత్సం! ముప్పులో ఉత్తరాది రాష్ట్రాలు

ఊరి పొలిమేరలో క్షుద్ర పూజలు.. తలకిందులుగా వేలాడుతున్న బొమ్మలు.. ఆదివారం అసలేం జరిగింది?



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *