Headlines

7 ఫోర్లు, 13 సిక్సర్లతో కాటేరమ్మ కొడుకు విధ్వంసం.. ప్రపంచ రికార్డ్‌నే అస్సాం పార్శిల్ చేశాడుగా..!


Abhishek Sharma Birthday: టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ నేడు తన 27వ పుట్టిన రోజు సెలబ్రేట్ చేసుకుంటున్నాడు. ఈ టీమిండియా డేంజరస్ ప్లేయర్ క్రికెట్ హిస్టరీలో ఎన్నో రికార్డులను తన పేరుతో లిఖించుకున్నాడు. 2000 సెప్టెంబర్ 4న పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో జన్మించిన అభిషేక్ ఎడమచేతి బ్యాటింగ్‌తో పరుగుల వర్షం కురిపిస్తుంటాడు. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరపున ఆడుతున్న అభిషేక్.. నిలకడైన ప్రదర్శనలతో భారత జట్టులో చోటు సంపాదించాడు. అంతర్జాతీయ అరంగేట్రం చేసిన కొద్దికాలానికే టీ20ల్లో తనదైన ముద్ర వేసిన సంగతి తెలిసిందే. 2025లో ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్‌లో 54 బంతుల్లో 135 పరుగులు చేసి భారత్ తరపున ఈ ఫార్మాట్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేశాడు. అదే ఏడాది ఆసియా కప్‌లోనూ అద్భుతంగా రాణించి టోర్నీ ఉత్తమ ఆటగాడిగా నిలిచాడు.

ర్యాంకింగ్స్‌లో దూకుడు..

2025 ఆసియా కప్‌లో 7 మ్యాచ్‌ల్లో 314 పరుగులు చేసిన అభిషేక్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’ అవార్డు దక్కింది. ఈ ప్రదర్శనతో ఐసీసీ టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరుకున్నాడు. అనంతరం 931 రేటింగ్ పాయింట్లకు చేరి పురుషుల టీ20 బ్యాటర్లలో ఇప్పటివరకు నమోదైన అత్యధిక రేటింగ్ పాయింట్ల రికార్డును నెలకొల్పాడు. అంతకుముందు ఇంగ్లాండ్ బ్యాటర్ డేవిడ్ మలాన్ 919 పాయింట్లతో ఈ రికార్డు కలిగి ఉన్నాడు.

ఎక్కువమంది చదివినది: 10880, 124, 18లతో లేడీ కోహ్లీ విధ్వంసం.. మిథాలీ ఆల్ టైం రికార్డ్ బ్రేక్.. హిస్టరీలోనే సరికొత్త క్రికెట్ క్వీన్‌గా..

అభిషేక్ వేగంగా పరుగులు చేయడమే కాకుండా ఎడమచేతి స్పిన్‌తోనూ జట్టుకు ఉపయోగపడగలడు. 2025లో అతడి ఎదుగుదల టీ20 క్రికెట్‌లో భారత బ్యాటింగ్‌కు మరో కీలక ఎంపికను అందించింది.

2026 మార్చిలోనూ అభిషేక్ టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో కొనసాగాడు. అదే సమయంలో ఇషాన్ కిషన్ రెండో స్థానంలో నిలవడంతో తొలిసారిగా ఇద్దరు భారత బ్యాటర్లు ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో టాప్-2 స్థానాలను ఆక్రమించారు.

మరికొన్ని కీలక రికార్డులు..

ఎక్కువమంది చదివినది: Video: మ్యాజిక్ బాల్‌తో మెంటలెక్కించిన టీమిండియా ఛీ కొట్టిన ప్లేయర్.. వీడియో చూస్తే..!

అభిషేక్ శర్మ కెరీర్ గణాంకాలు:

ఫార్మాట్ / లీగ్ మ్యాచ్‌లు పరుగులు అత్యధిక స్కోరు సగటు స్ట్రైక్ రేట్ 100లు / 50లు వికెట్లు
అంతర్జాతీయ T20I 34 1,190 135 37.4 190.0 2 / 7 6
ఐపీఎల్ (IPL) 90 2,350 141 27.5 160.0 2 / 13 11
మొత్తం టీ20లు (T20s) 165 4,900 148 33.0 165.0 8 / 28 54
లిస్ట్ ఎ (వన్డేలు) 68 2,188 170 34.18 95.0 4 / 8 41
ఫస్ట్ క్లాస్ (టెస్ట్) 24 1,071 100

తొలి సెంచరీ రికార్డు: అంతర్జాతీయ టీ20ల్లో తన 2వ మ్యాచ్‌లోనే (జింబాబ్వేపై) సెంచరీ సాధించిన రికార్డు తన పేరుతోనే ఉంది.

వ్యక్తిగత అత్యుత్తమ ఇన్నింగ్స్: అంతర్జాతీయ టీ20ల్లో భారత్ తరపున ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు (135), అత్యధిక సిక్సర్లు (13) బాదిన రికార్డులలో ఒకడిగా నిలిచాడు.

ఐపీఎల్‌లో దూకుడు: సన్‌రైజర్స్ హైదరాబాద్ తరపున అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ (16 బంతుల్లో), భారతీయుడి అత్యధిక వ్యక్తిగత స్కోరు (141) సాధించాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *