Headlines

సముద్రం లేని కరీంనగర్ చేపలకు తీరంలోనూ యమ గిరాకీ.. స్పెషాలిటీ ఏంటో తెలుసా?


కరీంనగర్ జిల్లా చేపలకు పలు రాష్ట్రాల్లో డిమాండ్ పెరిగింది. సముద్ర తీర ప్రాంత ప్రజలు కూడా ఇక్కడి చేపలను తినడానికి ఆసక్తి చూపుతుండటం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. కరీంనగర్ చేపలను ఇతర రాష్ట్రాలకు పెద్ద ఎత్తున ఎగుమతి చేస్తుండటం, ధరలు కూడా ఆశాజనకంగా ఉండటంతో పలువురు ఆనందం వ్యక్తంచేస్తున్నారు. ఇక్కడ పూర్తిగా మంచి నీళ్లలోనే చేపలు పెరుగుతున్నాయి.. దీంతో.. వీటి రుచి బాగుంటుంది.. సముద్ర చేపలు కాకుండా.. మంచి నీటిలో పెరిగే చేపలను చాలా మంది తింటారు. దీంతో స్థానిక మత్స్య కార్మికులు.. చేపలను పశ్చిమబెంగాల్, మహారాష్ట్ర, తళనాడుకు ఎగుమతి చేస్తూ పెద్ద ఎత్తున లాభాలు పొందుతున్నారు.

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎక్కడ కూడా సముద్రం లేదు.. ఇక్కడ ప్రాజెక్ట్లతో పాటు.. చెరువులు ఉన్నాయి.. అయితే.. ఇవన్ని మంచి నీళ్లే.. ప్రాజెక్టులతో పాటు.. చెరువుల్లో చేపలను పెంచుతున్నారు. మంచి నీళ్లలో పెరిగే చేపలు.. రుచిగా ఉంటాయి.. సముద్రంలో లభించే చేపల కంటే.. ఇక్కడ లభించే చేపల రుచి భిన్నంగా ఉంటుంది.. దీంతో… సముద్ర తీర ప్రాంత ప్రజలు కూడా ఇక్కడి చేపలను తినడానికి ఆసక్తి చూపుతున్నారు.

ఇక్కడి నుంచి ముఖ్యంగా పశ్చిమబెంగాల్, మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీకి చేపలను పంపిస్తున్నారు. కలకత్తాలో.. కరీంనగర్ జిల్లా చేపలకు మంచి డిమాండ్ ఉంది.. కరీంనగర్ జిల్లా చేపలు మార్కెట్లోకి రాగానే.. త్వరగానే అమ్ముడుపోతున్నాయని వ్యాపారస్థులు చెబుతున్నారు. భారీ సైజులో ఉన్న చేపలను తినడానికి ఆసక్తి చూపుతుండటంతో.. అలాంటి వాటిని ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు. రవ్వుతో పాటు.. జెల్లెకు మంచి డిమాండ్ ఉంటుందని స్థానిక వ్యాపారస్థులు తెలిపారు. మిగతా చేపలతో పోలీస్తే.. జెల్లె సైజు తక్కువగా ఉంటుంది.. చెరువుల్లో గానీ.. ప్రాజెక్టులో గానీ.. జెల్లె పడుతే త్వరగానే కొనుగోలు చేస్తున్నారు. అంతేకాదు.. కొంత మంది వ్యాపారులు.. ఫోన్లో కూడా బుక్ చేసుకుంటున్నారు. భారీ సైజులో ఉన్న చేపలు పడితే.. తమకే సమాచారం ఇవ్వాలని అక్కడి వ్యాపారస్తులు కోరుతున్నారు.

దీంతో.. పెద్ద, పెద్ద సైజులో ఉన్న చేపలన్నీ.. ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు. అయితే.. మంచి నీటిలో లభించే చేప రుచిగా.. సముద్రం చేప కంటే.. సైజు తక్కువగా ఉంటుంది.. పది నుంచీ 15 కిలోల వరకు మాత్రమే పెరిగే అవకాశం ఉంది.. ఇలాంటి సైజు ఉన్న చేప మరింత రుచిగా ఉంటుందని.. అందుకే.. వీటికి మరింత డిమాండ్ ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. కలకత్తాలో… కరీంనగర్ చేప కోసం ఎదురు చూస్తుంటారని.. వ్యాపారస్తులు చెబుతున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *