Headlines

అమ్మా.. ఊపిరి ఆడట్లేదు!.. స్పైడర్‌మ్యాన్ స్టంట్ చేస్తూ కిందపడ్డ చిన్నారి.. భయంకర వీడియో వైరల్‌


సోషల్ మీడియా రీల్స్, స్టంట్ల మోజులో చిన్నపిల్లలు ప్రమాదాల బారిన పడుతున్నారు. ఒక బాలుడు స్పైడర్‌మ్యాన్ కాస్ట్యూమ్ వేసుకుని, ఇంట్లోనే స్టంట్ చేయడానికి ప్రయత్నించి కిందపడిపోయిన భయంకరమైన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఒక చిన్న బాలుడు స్పైడర్‌మ్యాన్ అవుట్‌ఫిట్ ధరించి, తానొక నిజమైన సూపర్ హీరోలా భావించాడు. ఇంట్లోని ఒక ఎత్తైన ప్రదేశం, ఫర్నిచర్ పైకి ఎక్కి, అక్కడ నుండి కిందకు దూకుతూ స్టంట్ చేయడానికి ప్రయత్నించాడు. అయితే, అనుకోకుండా ఆ దూకడం వికటించడంతో బాలుడు నేరుగా కడుపు, ఛాతీ భాగం నేలకు బలంగా తగిలేలా కిందపడిపోయాడు.

ఆ దెబ్బ తీవ్రతకు క్షణాల్లో బాలుడికి ఊపిరి ఆడటం కష్టంగా మారింది. తీవ్ర భయాందోళనకు గురైన ఆ చిన్నారి రోదిస్తూ అమ్మా! నేను శ్వాస తీసుకోలేకపోతున్నాను అని గట్టిగా కేకలు వేశాడు. ఈ దృశ్యం చూసిన నెటిజన్లు తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతున్నారు.

ఇవి కూడా చదవండి



ఈ ఘటన పిల్లలను పెంచే విధానంపై, సోషల్ మీడియా వాడకంపై మరోసారి చర్చకు దారితీసింది. సూపర్ హీరో సినిమాలు, కార్టూన్లు, యూట్యూబ్ రీల్స్ చూసే పిల్లలు వాటిని నిజమని నమ్మి, తమ ఇంట్లోనే అనుకరించడానికి ప్రయత్నిస్తున్నారు. పిల్లలు టీవీలు, ఫోన్‌లలో ఏం చూస్తున్నారో తల్లిదండ్రులు గమనిస్తూ ఉండాలని నిపుణులు చెబుతున్నారు.

సినిమాల్లో కనిపించే విన్యాసాలు, స్టంట్‌లు గ్రాఫిక్స్ ద్వారా చేస్తారని, నిజ జీవితంలో అవి చేస్తే ప్రాణాలకే ప్రమాదమని పిల్లలకు అర్థమయ్యేలా వివరించాలి. లైక్‌లు, వ్యూస్ కోసం పిల్లలతో సాహసాలు చేయించడం లేదా వారిని ఒంటరిగా ప్రమాదకర వాతావరణంలో వదిలేయడం సరికాదు. అదృష్టవశాత్తూ ఆ బాలుడికి పెద్ద ప్రమాదం తప్పినప్పటికీ, ఈ వీడియో ప్రతి ఒక్క తల్లిదండ్రికీ ఒక కంటివిప్పులాంటిది. మన పిల్లల రక్షణ మన చేతుల్లోనే ఉందనే విషయాన్ని గుర్తుంచుకుని, ఇంట్లో వారు చేసే చిన్న చిన్న విన్యాసాల పట్ల కూడా జాగ్రత్త వహించడం ఎంతో అవసరం.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *