Coal Production: దేశానికి విద్యుత్ వెలుగులు.. దేశ ఆర్థికాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న కోల్ రంగం.. బొగ్గు ఉత్పత్తి.. రవాణాలో దూసుకుపోతుంది. 2025 జులై నెలతో పోలిస్తే, జూలై 2026లో భారతదేశ బొగ్గు ఉత్పత్తి 7.51 శాతం వృద్ధిని నమోదు చేసింది. జూలై లో దేశంలో మొత్తం బొగ్గు ఉత్పత్తి 69.75 మెట్రిక్ టన్నులకు చేరుకుంది. ఇది జూలై 2025లో ఉత్పత్తి అయిన 64.88 మెట్రిక్ టన్నుల కంటే ఎక్కువ. గత నెల బొగ్గు రవాణా గతేడాదితో పోలిస్తే 17.34 శాతం బలమైన వృద్ధిని కనబరిచింది. గత సంవత్సరం 73.57 మెట్రిక్ టన్నులతో పోలిస్తే, ఈసారి ఇది 86.33 మెట్రిక్ టన్నులకు చేరుకుంది.
బొగ్గు ఉత్పత్తి, రవాణాలో చోటు చేసుకుంటున్న వృద్ధి, బొగ్గు రంగంలో స్థిరమైన సరఫరా కార్యాచరణ స్థిరత్వాన్ని నిర్ధారించడానికి బొగ్గు మంత్రిత్వ శాఖ నిరంతర నిబద్ధత ప్రయత్నాలను స్పష్టం చేస్తుంది. 2026-27 ఆర్థిక సంవత్సరంలో జూలై వరకు బొగ్గు ఉత్పత్తి 302.24 మెట్రిక్ టన్నులుగా ఉండగా, బొగ్గు రవాణా 354.70 మెట్రిక్ టన్నులకు చేరుకుంది. ఇది గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే 5.87 శాతం వృద్ధిని నమోదు చేసింది.
కోల్ ఇండియా లిమిటెడ్ ద్వారా జూలై ఉత్పత్తి గణాంకాలకు 50.35 మెట్రిక్ టన్నులు ఉండగా గతేడాదితో పోలిస్తే 8.42 వృద్ధిని సాధించింది. కోల్ ఇండియా లిమిటెడ్ జూలైలో 63.67 మెట్రిక్ టన్నుల బొగ్గును రవాణా చేసింది. 2025 జూలైలో రవాణా చేసిన బొగ్గుతో పోలిస్తే 17.43 శాతం వృద్ధిని నమోదు చేసింది. గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే, 2026-27 ఆర్థిక సంవత్సరంలో జూలై వరకు కోల్ ఇండియా లిమిటెడ్ బొగ్గు రవాణా కూడా 6.81 శాతం వృద్ధిని నమోదు చేసింది.
సుస్థిర వృద్ధిని సాధించడం, బొగ్గు లభ్యతను మెరుగుపరచడం, దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడం వంటి వాటికి బొగ్గు మంత్రిత్వ శాఖ ప్రాధాన్యతగా తీసుకుంది. భవిష్యత్తులో భారతదేశ వృద్ధిని మరింత ముందుకు నడిపించడంలో బొగ్గు రంగం కీలక పాత్ర పోషిస్తుందని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి