అయితే ఫ్రిజ్, గీజర్, ఎయిర్ కండిషనర్ వంటి ఎక్కువ విద్యుత్ వాడే పరికరాల 16-ఆంపియర్ స్విచ్ బోర్డులలో కూడా ఈ లైటే ఉంటుంది. ఇది వాటికి ఒక సేఫ్టీ వార్నింగ్లాగా లాగా పనిచేస్తుంది. ఒక వేళ స్విచ్ ఆఫ్ చేసినప్పటికీ లైట్ వెలుగుతుంటే, సాకెట్లోకి ఇంకా కరంట్ సరఫరా అవుతోందని అర్థం. స్విచ్లోని పాయింట్లు లోపల ఒకదానికొకటి అతుక్కుపోవడం వల్ల ఇలా జరగవచ్చు. అలాంటప్పుడు వెంటనే స్విచ్ బోర్డును తనిఖీ చేయించాలి.