కోలీవుడ్ స్టార్ అథర్వ, ప్రీతి ముకుందన్ ప్రధాన పాత్రల్లో నటించిన రీసెంట్ లవ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘హృదయం మురళి’. అప్పుడెప్పుడో బాయ్స్ సినిమాలో నటించిన మ్యూజిక్ డైరెక్టర్ థమన్ మళ్లీ సుమారు 20 ఏళ్ల తర్వాత ఈ సినిమాలో నటించడం విశేషం. వీరితో పాటు మలయాళం స్టార్ ఫహాద్ ఫాజిల్, లేటెస్ట్ సెన్సేషన్ కయాదు లోహర్, మాళవికా మోహనన్ వంటి స్టార్స్ ఈ మూవీలో ప్రధాన పాత్రలు పోషించారు. టీజర్స్, ట్రైలర్ తోనే పాజిటివ్ వైబ్ తెచ్చుకున్న ఈ సినిమా జులై 11న ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది. ముఖ్యంగా యూత్ ఈ సినిమాను తెగ చూసేశారు. మైత్రీ డిస్ట్రిబ్యూషన్ ద్వారా తెలుగులోనూ రిలీజైన హృదయం మురళి సినిమాకు ఇక్కడ కూడా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. మొత్తానికి తమిళం, తెలుగులోనూ ఆడియెన్స్ ను అలరించిన ఈ ఫీల్ గుడ్ ఎంటర్ టైనర్ ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అవుతోంది. హృదయం మురళి సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఆగస్టు 07 నుంచి ఈ సినిమా ఓటీటీలోకి రానుంది. తమిళంతో పాటు తెలుగు సహా ఇతర భాషల్లోనూ ఈ సూపర్ హిట్ సినిమా స్ట్రీమింగ్ కు అందుబాటులోకి రానుంది.
హృదయం మురళి సినిమాకు ఆకాశ్ భాస్కరన్ దర్శకత్వం వహించారు. నిహారిక ఎన్ఎం, రాంకీ, సుధాకర్, నట్టి సుబ్రహ్మణ్యం, జోనిత గాంధీ తదితరులు కీలక పాత్రలు పోషించారు. డాన్ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మించిన ఈ సినిమాకు తమన్ సంగీతం అందించారు. మనోజ్ పరమహంస, సీహెచ్ సాయి సినిమాటోగ్రాఫర్లుగా వ్యవహరించారు. కాలేజీ ఫ్రెండ్ షిప్, ఫస్ట్ లవ్, వన్ సైడ్ లవ్ వంటి అంశాలతో తెరకెక్కిన ఈ సినిమా థియేటర్లలో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. మరి ఓటీటీలో ఈ మూవీకి ఎలాంటి రిజల్ట్ వస్తుందో చూడాలి.
ఇవి కూడా చదవండి
నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో హృదయం మురళి సినిమా..
📢 Official Announcement on the Way…#IdhayamMurali (Tamil)
Expected streaming from August 7 on Netflix in Tamil – Original, Telugu, Kannada, Malayalam, Hindi 🍿!!#OTT_Trackers pic.twitter.com/oMN3YGuldK— OTT Trackers (@OTT_Trackers) August 1, 2026
హృదయం మురళి సినిమా ట్రైలర్..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.