Headlines

Tollywood: న్యుమోనియాతో అక్క మరణం.. చిన్ననాటి ఫొటోలు షేర్ చేస్తూ టాలీవుడ్ డైరెక్టర్ ఎమోషనల్

Tollywood: న్యుమోనియాతో అక్క మరణం.. చిన్ననాటి ఫొటోలు షేర్ చేస్తూ టాలీవుడ్ డైరెక్టర్ ఎమోషనల్


ప్రముఖ దర్శకుడు మెహర్ రమేష్ ఇంట్లో ఇటీవల తీవ్ర విషాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. మెహర్ రమేష్ సోదరి జ్యోతి సుంకర న్యుమోనియాతో పోరాడుతూ కొన్ని రోజుల క్రితమే కన్నుమూశారు. సుమారు 14 రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స అందించినా ఆమె కోలుకోలేకపోయారు. వైద్యుల ప్రయత్నాలు ఫలించక ఆమె కన్నుమూయడంతో మెహర్ రమేష్ తో పాటు ఆయన కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఈ నేపథ్యంలో అక్క మరణంతో తీవ్ర భావోద్వేగానికి లోనైన మెహర్ రమేష్ తాజాగా సోషల్ మీడియా వేదికగా చేసిన ఒక ఎమోషనల్ పోస్ట్ అందరినీ కదిలిస్తోంది. అక్కతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఆయన షేర్ చేసిన ఫొటోలు ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి. ఈ బ్లాక్ అండ్ ఫొటోల్లో మెహర్ రమేష్, ఆయన సోదరి క మెహర్ జ్యోతి సుంకరతో పాటు వారి మామయ్య మెగాస్టార్ చిరంజీవి కూడా ఉన్నారు. దీంతో పాటు కష్టకాలంలో తన కుటుంబానికి అండగా నిలిచిన పవర్ స్టార్ పవన్ కల్యాణ్, నాగబాబు ఫొటోలను కూడా మెహర్ రమేష్ ఇందులో పోస్ట్ చేశారు. తమ కష్ట సమయంలో అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ‘నా జీవితంలో అత్యంత క్లిష్ట సమయంలో మా కుటుంబానికి ధైర్యం చెప్పిన బంధువులు, స్నేహితులు, సినీ ప్రముఖులు, అభిమానుల ప్రేమను ఎప్పటికీ మర్చిపోలేను. అక్క జ్ఞాపకాలు ఎప్పటికీ మా హృదయాల్లో నిలిచిపోతాయి. ఆమె మా పట్ల చూపించిన ప్రేమ, ఆప్యాయత జీవితాంతం వెంట ఉంటాయి’ అని తన ఆవేదనకు అక్షర రూపమిచ్చారు మెహర్ రమేష్.


ఇవి కూడా చదవండి



కాగా, మెహర్ జ్యోతి సుంకర 14 రోజులు పాటు వైరల్ న్యుమోనియాతో పోరాడుతూ కన్నుమూశారు. ఈ వార్త తెలియగానే
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వయంగా ఆసుపత్రికి వెళ్లి మెహర్ రమేష్‌ను పరామర్శించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ నేపథ్యంలో మెగా ఫ్యామిలీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు మెహర్ రమేష్. కాగా కన్నడలో పలు సూపర్ హిట్ సినిమాలు తీసిన మెహర్ రమేష్ బిల్లా, కంత్రి, శక్తి, షాడో, భోళా శంకర్ సినిమాలతో తెలుగు ఆడియెన్స్ ను పలకరించారు.

టాలీవుడ్ డైరెక్టర్ మెహర్ రమేష్ ఎమోషనల్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *