Headlines

200ఏళ్ల నాటి రాజమహల్‌ రహస్యం.. 52గదులు, 53 తలపుల వెనుక అంతులేని వైభవం..!

200ఏళ్ల నాటి రాజమహల్‌ రహస్యం.. 52గదులు, 53 తలపుల వెనుక అంతులేని వైభవం..!


200ఏళ్ల నాటి రాజమహల్‌ రహస్యం.. 52గదులు, 53 తలపుల వెనుక అంతులేని వైభవం..!

52 గదులు, 53 తలుపుల అంతుచిక్కని రహస్యం.. అంటే నలంద ఆమావ రాజ ప్రాసాద కథ.. చరిత్ర పుటలలో మరుగునపడి ఉంది. బీహార్‌లోని నలందలో 22 ఎకరాల్లో విస్తరించి ఉన్న 200 ఏళ్ల పురాతన అమావ ప్యాలెస్ నేడు శిథిలావస్థలో ఉండవచ్చు, కానీ ఒకప్పుడు ఇది మగధలోని అత్యంత సంపన్నమైన రాచరిక రాష్ట్రం. 52 గదులున్న ఈ ప్యాలెస్‌లోనే బీహార్ మొట్టమొదటి ప్రైవేట్ విద్యుత్ కేంద్రం ఉండేది. పూర్తి వివరాల్లోకి వెళితే…

52 కోఠీలు.. 53 దర్వాజాల విచిత్రం!

సుమారు 22 ఎకరాల విశాలమైన విస్తీర్ణంలో రాజా హరిహర్ నారాయణ్ సింగ్ ఈ రాజభవనాన్ని నిర్మించారు. ఈ మహల్‌లో 52 విశాలమైన భవనాలు (కోఠీలు), 53 ప్రధాన ద్వారాలు ఉండటం దీని ప్రత్యేకత. అందుకే స్థానికులు దీనిని 52 కోఠీ, 53 దర్వాజా అని పిలుస్తారు. ఒక ద్వారం ద్వారా లోపలికి ప్రవేశిస్తే 52 గదులను చుట్టి రావచ్చని, కానీ, 53వ ద్వారం మాత్రం అత్యవసర సమయాల్లో తప్పించుకోవడానికి రహస్య సొరంగ మార్గంగా ఉపయోగపడేదని ప్రచారంలో ఉంది.

బీహార్‌లోనే మొదటి ప్రైవేట్ పవర్ హౌస్!

అమావా సంస్థానం కేవలం రాజసానికే కాకుండా సాంకేతిక అభివృద్ధికి కూడా నిదర్శనంగా నిలిచింది. బ్రిటీష్ కాలంలోనే ఈ రాజభవనం కోసం ప్రత్యేకంగా సొంత పవర్ హౌస్‌ను ఏర్పాటు చేసుకున్నారు. బీహార్ రాష్ట్రంలోనే ఒక ప్రైవేట్ ప్రాంగణంలో విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి కావడం విశేషం. రాజభవనం, దివాన్ ఖానా, అంతఃపురం అంతా ఆ కాలంలోనే విద్యుత్ కాంతులతో వెలిగిపోయేది.

లండన్ మోడల్ గడియారం.. రాయల్ వైభవం

రాజభవన ప్రాంగణంలో లండన్ బిగ్ బెన్ శైలిలో ఒక పెద్ద క్లాక్ టవర్‌ను నిర్మించారు. ఈ గడియారం మోగే శబ్దం చుట్టుపక్కల కొన్ని కిలోమీటర్ల వరకు వినిపించేదని చెబుతారు. దీనితో పాటు విదేశాల నుంచి తెప్పించిన అద్దాలు, దిగుమతి చేసుకున్న ఫర్నిచర్, విశాలమైన ఈతకొలనులు, అరుదైన గులాబీ తోటలతో ఈ మహల్ ఎంతో అద్భుతంగా ఉండేది. అంతేకాకుండా, ఈ రాజభవన సముదాయంలో ఒక పెద్ద సంస్కృత కళాశాల పనిచేసేది, ఇక్కడ దేశంలోని వివిధ రాష్ట్రాల నుండి వందలాది మంది విద్యార్థులు చదువుకోవడానికి వచ్చేవారు.

నలంద నుండి టెకారి వరకు డప్పుల మోత

హరిహర నారాయణ్ ప్రసాద్ సింగ్ రాజు ఈ సంస్థానం నలంద నుండి టేకారి వరకు విస్తరించి ఉండేది. ఆ కాలంలో కూడా, సంస్థానం వార్షిక ఆదాయం సుమారు 50,000 రూపాయలు ఉండేది. రాజు పలుకుబడి ఎంత గొప్పదంటే, దేశంలోని చాలా ప్రధాన పుణ్యక్షేత్రాలలో ప్రజలు బస చేయడానికి ఆమవ సంస్థానానికి సొంత ప్రైవేట్ ధర్మశాలలు (సత్రాలు) ఉండేవి.

వీడియో ఇక్కడ చూడండి..

 

View this post on Instagram

 

A post shared by Gautam kumar (@onroad____)

ఒకే చట్టం, ఆ మెరుపులన్నీ మాయం!

ఈ రాజకుటుంబం పన్నులు వసూలు చేయడమే కాకుండా, బావులు, చెరువులు తవ్వడం, దేవాలయాలు నిర్మించడం వంటి సాంఘిక పనులను కూడా చేసేది. అయితే, భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత, జమీందారీ రద్దు చట్టం అమలులోకి రాగానే, అమావా ఎస్టేట్ హోదా పూర్తిగా రద్దయింది. అంతటి వైభవాన్ని చూసిన ఈ రాజమహల్, జమీందారీ వ్యవస్థ రద్దు కావడం, సరైన నిర్వహణ లేకపోవడంతో కాలక్రమేణా నిరాదరణకు గురైంది. నేడు శిథిల గోడలతో దర్శనమిస్తున్నా, తన గతం నాటి రాజసాన్ని, రహస్యాలను ఇంకా తదేకంగా వినిపిస్తూనే ఉంది. ఇప్పుడు, స్థానికులు దీనిని పునరుద్ధరించి, పర్యాటక కేంద్రంగా మార్చాలని డిమాండ్ చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *