Headlines

వీడు అసలు మనిషేనా..! 7వ తరగతి విద్యార్థినికి అసభ్య మెసేజ్‌లు.. మొబైల్‌లో షాకింగ్ చాట్స్!

వీడు అసలు మనిషేనా..! 7వ తరగతి విద్యార్థినికి అసభ్య మెసేజ్‌లు.. మొబైల్‌లో షాకింగ్ చాట్స్!


వీడు అసలు మనిషేనా..! 7వ తరగతి విద్యార్థినికి అసభ్య మెసేజ్‌లు.. మొబైల్‌లో షాకింగ్ చాట్స్!

ఓ ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయుడిపై తీవ్ర ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఏడో తరగతి చదువుతున్న విద్యార్థినితో మొబైల్ ఫోన్ ద్వారా లైంగికంగా అసభ్యకరమైన సంభాషణలు జరిపాడు. అంతేకాదు, అభ్యంతరకర సందేశాలు పంపినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉపాధ్యాయుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాధిత విద్యార్థిని కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ దారుణ ఘటన బీహార్‌లోని ఛప్రా జిల్లాలో చోటు చేసుకుంది.

ఛప్రా నగరంలోని భగవాన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇంపీరియల్ పబ్లిక్ స్కూల్‌లో జరిగింది. అక్కడ పనిచేస్తున్న మహమ్మద్ ఇమామ్ రజా అనే ఉపాధ్యాయుడు విద్యార్థినితో అనుచితంగా చాట్ చేసినట్లు కుటుంబ సభ్యులు గుర్తించారు. విషయం బయటపడిన వెంటనే వారు పోలీసులను ఆశ్రయించగా, స్థానికులు నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు.

పోలీసులు నిందితుడి మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకుని డిజిటల్ ఫోరెన్సిక్ పరిశీలనకు పంపించారు. ప్రాథమిక విచారణలో మొబైల్‌లో అనేక అభ్యంతరకర చాట్‌లు, అసభ్యకర సందేశాలు, ఫోటోలు ఉన్నట్లు పోలీసులు గుర్తించినట్లు సమాచారం. ప్రస్తుతం ఆ డిజిటల్ ఆధారాలను పూర్తిగా విశ్లేషిస్తూ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

ఇతర విద్యార్థినులతో కూడా నిందితుడు ఇలాంటి అనుచిత సంబంధాలు కొనసాగించాడా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. దర్యాప్తులో మరిన్ని బాధితులు ఉన్నట్లు తేలితే, సంబంధిత చట్టాల ప్రకారం అదనపు కేసులు నమోదు చేసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. బాధితురాలి వాంగ్మూలం, కుటుంబ సభ్యుల ఫిర్యాదు, మొబైల్‌లో లభించిన డిజిటల్ ఆధారాల ఆధారంగా కేసును బలపరుస్తున్నారు.

ఈ ఘటనపై విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలికల భద్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించబోమని, నిందితుడిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పాఠశాలల్లో విద్యార్థుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని వారు పేర్కొన్నారు. ప్రస్తుతం పోలీసులు కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఆరోపణలు ఇంకా దర్యాప్తు దశలోనే ఉన్నాయి. కోర్టులో నేరం రుజువయ్యే వరకు నిందితుడిని చట్టపరంగా నిర్దోషిగా పరిగణిస్తామని పోలీసులు తెలిపారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *