Headlines

Boy Friend For Rent: గంటల లెక్కన అద్దెకు ప్రియుడు!..సోషల్‌ మీడియాలో సరికొత్త ట్రెండ్

Boy Friend For Rent: గంటల లెక్కన అద్దెకు ప్రియుడు!..సోషల్‌ మీడియాలో సరికొత్త ట్రెండ్


స్మార్ట్‌ఫోన్ క్లిక్‌తో క్యాబ్ బుక్ చేసుకున్నట్లే.. ఇప్పుడు ‘బాయ్‌ఫ్రెండ్’ను కూడా అద్దెకు బుక్ చేసుకునే సరికొత్త సంస్కృతి మెట్రో నగరాల్లో ఊపందుకుంటోంది. ఒకప్పుడు జపనీస్ డ్రామాల్లో మాత్రమే కనిపించిన ‘రెంట్-ఎ-బాయ్‌ఫ్రెండ్’ కాన్సెప్ట్, ఇప్పుడు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా భారతీయ యువతులను సైతం ఆకర్షిస్తోంది. ఒంటరితనాన్ని దూరం చేసుకునేందుకు గంటల చొప్పున అద్దె చెల్లించి అబ్బాయిలతో డేటింగ్‌కు వెళ్లేందుకు నేటితరం ఆసక్తి చూపుతోంది. ఇది కేవలం ఒక సహచర సేవ మాత్రమే. వినియోగదారులు ఆన్‌లైన్ ప్రొఫైల్‌లను పరిశీలించి, తమకు నచ్చిన సమయాన్ని బుక్ చేసుకుంటారు. కలిసి సినిమా చూడటం, షాపింగ్‌కు వెళ్లడం, కాఫీ తాగుతూ మనసు విప్పి మాట్లాడటం లేదా ఫ్యామిలీ ఈవెంట్స్‌లో తోడుగా నిలవడం వంటి పనుల కోసం వీరిని అద్దెకు తీసుకుంటారు. గంటల లెక్కన మీటర్ నడుస్తూనే ఉంటుంది. అయితే, ఇందులో లైంగిక సంబంధాలకు అస్సలు తావుండదు. ఏకాంత ప్రదేశాలకు వెళ్లడం, హోటల్ గదుల్లో గడపడం, రాత్రి బస చేయడం వంటి వాటిపై కఠినమైన నిబంధనలు ఉంటాయి. ఈ వినూత్న ఆలోచన 1990లలో జపాన్‌లో ప్రారంభమైన ‘అద్దె వ్యక్తుల’ ఆర్థిక వ్యవస్థ నుండి పుట్టుకొచ్చింది. జపనీస్ సంస్కృతిలో భావోద్వేగాలను నియంత్రించుకోవడం ఎక్కువ. దాంతో, ఎలాంటి బంధాల ఒత్తిడి లేకుండా మనసు విప్పి మాట్లాడటానికి ఈ మార్గాన్ని ఎంచుకున్నారు. టోక్యోలో దీని ధర గంటకు సుమారు రూ. 1,700 నుండి రూ. 3,500 వరకు ఉంటుంది. ఇటీవల కాలంలో అంతర్జాతీయ ట్రావెల్ ఇన్‌ఫ్లుయెన్సర్లు ఈ అద్దె ప్రియుల అనుభవాలను యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ ద్వారా పంచుకోవడంతో ఈ ట్రెండ్ ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయింది. భారతదేశంలో కూడా యువత ఒంటరితనం, మానసిక ఒత్తిడిని జయించడానికి, అలాగే సమాజంలో తాము ఒంటరిగా లేమని నిరూపించుకోవడానికి ఫేస్‌బుక్ గ్రూపులు, ఇన్‌స్టాగ్రామ్ పేజీల ద్వారా “మూవీ పార్ట్‌నర్స్”, “షాపింగ్ బడ్డీస్” పేరిట ఈ సేవలను వినియోగించుకుంటున్నారు. తాత్కాలిక బంధాల కోసం భారీగా ఖర్చు చేయడానికి కూడా వెనుకాడటం లేదు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఒకే ఓటీటీలో 60 సినిమాలు.. ఎంటర్‌టైన్మెంట్ మామూలుగా ఉండదు!

Bigg Boss Telugu: బిగ్ బాస్‌ షురూ.. ‘గంగూలీ’ రాకతో క్రేజ్‌ మరింత ఎత్తుకు..

Jabardasth: జబర్దస్త్‌లోకి స్టార్ కమెడియన్.. రీ ఎంట్రీ.. ఇక పంచ్‌లతో రచ్చ రచ్చే!

Chiranjeevi: మెగా అభిమానులకు గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికీ చిరు నుంచి దిమ్మతిరిగే బర్త్‌ డే కానుక

Balakrishna: బాలయ్య హెల్త్ అప్‌డేట్.. ప్రస్తుతం ఎలా ఉన్నారంటే..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *