అభిమన్యు సింగ్ అనే నార్త్ నటుడు ఇప్పుడు తెలుగునాట చాలా పాపులర్. ఆయన చాలా సినిమాల్లో విలన్ వేషాలు వేశారు. ఆయన తన రెమ్యూనరేషన్ గురించి మాట్లాడుతూ, ఆయన మొదటి సినిమాకు కేవలం రూ.11,000 మాత్రమే రెమ్యూనరేషన్ ఇచ్చినట్లు తెలిపారు. రామ్ గోపాల్ వర్మ తీసిన రక్త చరిత్ర సినిమాకు రూ.40,000 పారితోషికం తీసుకున్నట్లు తెలిపారు. రక్త చరిత్ర బ్లాక్ బాస్టర్ హిట్ అవ్వడంతో.. తన పారితోషకం లెక్క మారిందని, ఆ వెంటనే గబ్బర్ సింగ్ సినిమాకు తనకు దాదాపు రూ.40 లక్షలు లభించాయని పేర్కొన్నారు. ఇది ఒక భారీ మార్పు అని స్పష్టం చేశారు. ఒక్క సినిమాలో మంచి పేరు వస్తే.. అతని జీవితం ఎంత మారిపోతుందో ఈ సందర్భం తెలియజేస్తుంది.
ఇక గబ్బర్ సింగ్ సినిమా అనుభవం గొప్పదని అభిమన్యు సింగ్ వివరించారు. పవన్ కళ్యాణ్ అప్పట్లో చాలా బిజీగా ఉండేవారని, దీంతో దర్శకుడు హరీష్ శంకర్ తన సన్నివేశాలతోనే షూటింగ్‌ను ప్రారంభించాలని నిర్ణయించుకున్నారని తెలిపారు. పవన్ కళ్యాణ్ వచ్చేలోపు, తన సన్నివేశాలను షూట్ చేయడానికి హరీష్ శంకర్ 10 రోజుల సమయం కేటాయించారు. ఈ సమయంలోనే ఆయన ఇంట్రో సీన్స్ అన్ని తీశారు. గబ్బర్ సింగ్ సినిమా కూడా బ్లాక్ బాస్టర్ హిట్ అవ్వడంతో.. అభిమన్యుసింగ్ తెలుగులో వరుస అవకాశాలు అందుకున్నారు.
Also Read: అప్పు వెంటనే కట్టాలని వేధిస్తున్నారా..? ఈ ఒక్కటి చేస్తే మీ జోలికి అస్సలు రారు..