Headlines

హైదరాబాద్‌లో విచిత్రం..పిండం పెట్టడం కోసం కాకి కొనుగోలు

హైదరాబాద్‌లో విచిత్రం..పిండం పెట్టడం కోసం కాకి కొనుగోలు


చివరికి వారు ఓ వింత నిర్ణయం తీసుకున్నారు. సమీపంలోని ముర్గి చౌక్‌కు వెళ్లి, అక్కడ ఓ కాకిని కొని తీసుకువచ్చారు. ఆ కాకితో పిండం ముట్టించి కార్యక్రమాన్ని పూర్తిచేశారు. ఈ ఘటన వేసవి తాపం కేవలం మనుషులనే కాకుండా పక్షులు, ఇతర జీవజాలాన్ని కూడా ఎంతలా ఇబ్బంది పెడుతోందో తెలియజేస్తోంది. ఓ కుటుంబం ఏకంగా ఒక కాకిని కొని తమ ఆచారాన్ని పూర్తి చేసుకోవాల్సి వచ్చింది. తీవ్రమైన ఎండల ప్రభావం సంప్రదాయ కార్యక్రమాలపై కూడా ఎలా పడుతోందో ఈ ఘటన తెలియచేసింది. హిందూ సంప్రదాయంలో పితృకార్యాల సమయంలో కాకికి పిండం పెట్టడం చాలా ముఖ్యమైంది. కాకిని పితృదేవతల రూపంగా భావిస్తారు. కాకి పిండాన్ని స్వీకరిస్తే, పితృదేవతల ఆత్మ శాంతించినట్లు, వారు సంతృప్తిగా ఉన్నట్లు నమ్ముతారు. అయితే, పిండాన్ని బలవంతంగా కాకితో ముట్టించడం శాస్త్రసమ్మతం కాదని, అది సహజంగా జరగాల్సిన ప్రక్రియ అని పండితులు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పిండాన్ని ఆవుకు తినిపించడం లేదా నదిలో కలపడం వంటి ప్రత్యామ్నాయాలు కూడా ఉన్నాయని వారు సూచిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం :

సడన్‌గా సైలెంట్ అయిన డార్లింగ్‌.. రీజనేంటి?

పూరి @26..మళ్లీ బౌన్స్ బ్యాక్ అవుతారా..?

పాన్ ఇండియా హిట్‌ వరమా..శాపమా?

ఊరిస్తున్న ఒక్క పాట.. పెద్ది టీమ్ ప్లానేంటి?

సమ్మర్‌ హీట్‌.. లైట్‌ అంటున్న స్టార్స్‌



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *