Headlines

బంగాళాఖాతంలో మారుతున్న వాతావరణం.. ఏపీకి మరో తుఫాన్ ముప్పు.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్


బంగాళాఖాతంలో మారుతున్న వాతావరణం.. ఏపీకి మరో తుఫాన్ ముప్పు.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్

ఏపీకి మరో తుఫాన్ ముప్పు పొంచి ఉంది.. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తుఫానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్, రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (RTGS) సీఈఓ ప్రఖర్ జైన్ వెల్లడించారు. ఇది వాయవ్య దిశగా పయనించి రేపు సుస్పష్టమైన అల్పపీడనంగా, ఆదివారం ఉదయానికి అదే ప్రాంతంలో వాయుగుండంగా మారే అవకాశం ఉందన్నారు. ఆ తదుపరి ఉత్తర వాయవ్య దిశగా కదులుతూ సోమవారం ( నవంబర్ 16 )  సాయంత్రానికి మధ్య బంగాళాఖాతంలో తుపానుగా బలపడే అవకాశం ఉందని పేర్కొన్నారు. అయితే.. తుఫానుగా మారితే.. అక్వాన్‌గా నామకరణం చేయనున్నారు.

ఆదివారం నుంచి సముద్రం అలజడిగా ఉండే అవకాశం ఉన్నందున మత్స్యకారులు వేటకు వెళ్ళరాదని హెచ్చరించారు. వేటకు వెళ్లిన మత్స్యకారులు తీరానికి తిరిగి రావాలని సూచించారు. ప్రస్తుత వాతావరణ అంచనాల ప్రకారం ఇది వాయువ్య దిశగా కదులుతూ ఉత్తర తమిళనాడు –కోస్తాంధ్ర తీరాల వైపు వచ్చే అవకాశం ఉందని తెలిపారు.

17వ తేదీ నుంచి ఏపీపై ప్రభావం చూపనుంది. వాయుగుండంగా బలపడిన తర్వాత దాని దిశపై స్పష్టత వస్తుందన్నారు విశాఖ తుఫాన్‌ హెచ్చరికల కేంద్రం డైరెక్టర్ PLN మూర్తి. ఈనెల 19న సాయంత్రం తీరం దాటే అవకాశం ఉందన్నారు.

అయితే కచ్చితంగా ఏ దిశగా వెళ్తుంది, ఎంతవరకు బలపడుతుంది, ఎక్కడ తీరం దాటుతుంది అనే విషయాలపై ఇంకా పూర్తి స్పష్టత రావాల్సి ఉందన్నారు. ఈ వాతావరణ పరిస్థితులని నిశితంగా పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు సమాచారాన్ని ప్రజలకు అందిస్తామని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో వచ్చే వదంతులను ఎవరూ నమ్మవద్దని, కేవలం అధికారిక సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని విజ్ఞప్తి చేశారు.

16, 17 తేదీలలో సముద్రంపై తుఫాను కదలికలు కీలకమైనవి. నవంబర్ 17న తుఫాను ఏ దిశగా వెళ్తుందో మనం అంచనా వేయగలిగే అవకాశం ఉంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *