బెంగాలీలు ఇప్పటికి కూడా ఈ చేపలు ఎంతో ఇష్టంగా తింటారు ఇవి లేకుండా అస్సలు ఉండలేరు. ఇంకా చెప్పాలంటే వీళ్ళు రోజులో
ఒక్కసారైనా వీటి రుచి చూడాలని ఎంతో ఆశ పడుతుంటారు. వాళ్ళు ఈ చేపలు తినడానికి టేస్ట్ మాత్రమే కాకుండా ఇంకా వీటిలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు, ప్రోటీన్, విటమిన్లు అధికంగా ఉంటాయి.
వీటిని రోజూ తప్పకుండా తీసుకుంటే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది ఇంకా ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది. కొందరు వీటిని వారంలో ఒక్కసారి తింటారు. అంతేకాకుండా, ఈ చేపలు తినడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. అవేంటో ఇక్కడ స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం..
చేపలలో ఉండే ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు బ్లడ్ ప్రెజర్ ను నియంత్రించడంలో ఇది ఎంతగానో సహాయపడతాయి. ఇంకా ఇవి గుండె పోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అందుకే తింటారు. ఇది మాత్రమే కాకుండా వీటిని మనం క్రమం తప్పకుండా తింటే జ్ఞాపకశక్తి పెరుగుతుంది. మతి మరుపు వంటి సమస్యలను రానివ్వదు.
అలాగే, వయసు సంబంధిత సమస్యలను కూడా ఇది తగ్గిస్తుంది. ఈ చేపలలో ఉండే ప్రోటీన్స్ ఈజీగా జీర్ణమయ్యే లా చేస్తుంది.
ఇది కండరాల నిర్మాణానికి, ఇంకా శరీర బలాన్ని కూడా ఇది పెంచుతుంది అలాగే ఆరోగ్యంగా ఉంచుతుంది. వీటిలో ఉండే పోషకాలు, విటమిన్లు కంటి చూపును కూడా మెరుగుపరుస్తుంది.
అంతేకాదు, ఈ చేపలలో ఉండే కొవ్వులు చర్మానికి, ఇంకా జుట్టు కూడా ఊడకుండా చేస్తుంది. అలాగే, ఇది చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది. జుట్టు రాలడాన్ని పూర్తిగా తగ్గిస్తుంది. చేపలు ఉండే విటమిన్ డి ఎముకలను బలంగా ఉంచుతుంది. శరీర రోగనిరోధక వ్యవస్థను కూడా మెరుగుపరుస్తుంది.




