
బంగారం ధరల్లో ఊహించని మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల కాలంలో భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. వాస్తవానికి
బులియన్ మార్కెట్లో ఒక్కోసారి ధర పెరిగితే.. మరికొన్ని రోజుల్లో తగ్గుతూ ఉంటాయి. అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులు మార్కెట్ ధరలపై ప్రభావం చూపుతుంటాయని నిపుణులు చెబుతున్నారు. కాగా.. ఇటీవల పెరిగిన ధరలు.. తగ్గి ఊరటనిస్తున్నాయి.. బుధవారం 24 క్యారెట్ల బంగారం 10గ్రాములపై దాదాపు 700ల వరకు ధర తగ్గింది. పలు వెబ్సైట్లలో నమోదైన ధరల ఆధారంగా గురువారం అక్టోబర్ 6 ఉదయం 6 గంటల వరకు దేశీయంగా బంగారం, వెండి ధరలు ఈ కింది విధంగా ఉన్నాయి.
24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధరపై రూ10 మేర తగ్గి.. రూ.1,41,970 గా ఉంది.
22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర 10 తగ్గి.. రూ.1,30,140 గా ఉంది.
వెండి కిలో ధరపై రూ.100 మేర తగ్గి.. రూ.1,99,900 లుగా కొనసాగుతోంది.
అయితే.. ప్రాంతాల వారీగా బంగారం, వెండి ధరల్లో వ్యాత్యాసం ఉంటుంది.