వాస్తు పరంగా ప్రాముఖ్యత..
వాస్తు శాస్త్రం ప్రకారం పారిజాత మొక్క ఇంట్లో ఉంటే ప్రతికూల శక్తులు తగ్గి, సానుకూల శక్తి పెరుగుతుందని నమ్మకం. ఇంటి వాతావరణం ప్రశాంతంగా, సౌహార్దంగా మారుతుందని కూడా చెబుతారు. చాలామంది దీన్ని లక్ష్మీదేవి అనుగ్రహానికి సంకేతంగా భావిస్తారు. ఇంట్లో తులసి దగ్గర ఈ మొక్కను నాటడం మంచిదని, అలాగే ఈశాన్య, తూర్పు లేదా ఉత్తర దిశల్లో పెంచితే శుభఫలితాలు కలుగుతాయని వాస్తు నిపుణుల అభిప్రాయం.