Banking Rules: తరచుగా ఉద్యోగాలు మారితే బ్యాంకులు రుణాలు ఇవ్వవా..? ఈ రూల్స్ గురించి తెలుసుకోండి..

Banking Rules: తరచుగా ఉద్యోగాలు మారితే బ్యాంకులు రుణాలు ఇవ్వవా..? ఈ రూల్స్ గురించి తెలుసుకోండి..


Banking Rules: తరచుగా ఉద్యోగాలు మారితే బ్యాంకులు రుణాలు ఇవ్వవా..? ఈ రూల్స్ గురించి తెలుసుకోండి..

అత్యవసర పరిస్థితుల్లో ఎక్కువమంది పర్సనల్ లోన్ తీసుకుంటూ ఉంటారు. ఇటీవల ఇన్‌స్టంట్ పర్సనల్ లోన్ పేరుతో నిమిషాల వ్యవధిలోనే రుణాలను బ్యాంకులు, ఎన్‌ఎఫ్‌బీసీ సంస్థలు మంజూరు చేస్తున్నాయి. అవసరమైన డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయగానే లోన్ అమౌంట్ నేరుగా బ్యాంక్ అకౌంట్లో జమ చేస్తున్నాయి. అయితే ఏదైనా రుణం తీసుకోవాలంటే సిబిల్ స్కోర్ కీలక పాత్ర పోషిస్తుంది. మినిమం క్రెడిట్ స్కోర్ 750 లేకుండా ఏ బ్యాంక్ రుణం ఇవ్వదు. ఒకవేళ ఇచ్చినా అధిక వడ్డీ రేటు ఫిక్స్ చేస్తాయి. ఇక క్రెడిట్ స్కోర్‌తో పాటు క్రెడిట్ హిస్టరీ కూడా రుణం మంజూరులో ముఖ్యపాత్ర పోషిస్తుంది. మీరు ఇంతకముందు తీసుకున్న రుణాలను కరెక్ట్‌గా చెల్లించారా.. ? లేదా? అనేవి చూస్తాయి.

ఉద్యోగం మారితే..

ఇక ఎక్కువ జీతం, కంఫర్ట్ కోసం చాలామంది రెగ్యూలర్‌గా కంపెనీలు మారుతూ ఉంటారు. ఇటీవల బ్యాంకులు ఉద్యోగాన్ని కూడా రుణం మంజూరులో ప్రయారిటీగా తీసుకుంటున్నాయి. స్ధిరంగా ఉద్యోగాలు చేసేవారికి లోన్లు త్వరగా మంజూరు అవుతాయి. ఎక్కువగా ఉద్యోగాలు మారుతుంటే ప్రక్రియ ఆలస్యం అవుతుంది. మీరు ఉద్యోగం మారిన సమయంలో కొత్త ఉద్యోగాన్ని బ్యాంకులు సెటిలింగ్ ఇన్ పీరియడ్‌గా పరిగణిస్తాయి. మీరు ఉద్యోగంలో సెటిల్ అయ్యేంతవరకు బ్యాంకులు రుణం మంజూరు చేసేందుకు ఆసక్తి చూపవు. తరచుగా మీరు ఉద్యోగాలు మారుతుంటే పర్సనల్ లోన్ పొందటంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఇక మీరు పనిచేసే ఇండస్ట్రీలో ఉద్యోగ మార్పు రేటు ఎక్కువగా ఉన్నా బ్యాంకులు లోన్ ఇచ్చేందుకు ఆలోచిస్తాయి. ఇక స్టార్టప్ కంపెనీల్లో చేసేవారికి కూడా త్వరగా రుణాలు మంజూరు కావు. అదే ఎంఎన్‌సీ కంపెనీల్లో చేస్తుంటే రుణాలు వెంటనే వస్తాయి.

ప్రొబేషన్ పీరియడ్‌లో ఉంటే..

ఇక ప్రొబేషన్ పీరియడ్‌లో ఉన్నవారికి రుణాలు బ్యాంకులు ఇవ్వవు. మీ దరఖాస్తును రిజెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. ప్రొబేషన్ కాలాన్ని అనిశ్చితి కాలంగా బ్యాంకులు పరిగణిస్తాయి. అందుకే రుణాలు ఇచ్చేందుకు వెనకడుగు వేస్తాయి. ఇక కాంట్రాక్ట్, ఫ్రీలాన్స్ ఉద్యోగాలు చేసేవారికి కూడా రుణాలు అందించవు. మీరు ఒకే సంస్థలో ఎక్కువకాలం పనిచేయడం, జీతంలో పెరుగుదల నమోదు అయితే రుణాలు వేగంగా అందిస్తాయి. మీరు ఏదైనా కొత్త ఉద్యోగం చేరితే వెంటనే రుణం కోసం దరఖాస్తు చేసుకోవద్దు. మినిమం ఆరు నెలల పాటు వేచి ఉండటం మంచిది. అంతేాకాకుండా సిబిల్ స్కోర్, క్రెడిట్ హిస్టరీ చూసుకోండి. ఆ తర్వాతనే రుణాల కోసం దరఖాస్తు చేసుకోవడం మంచిది. దరఖాస్తు తిరస్కరణకు గురైనా, ఎక్కువ బ్యాంకుల్లో రుణం కోసం దరఖాస్తు చేసుకున్నా సిబిల్‌పై ప్రభావితం చూపుతుంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *