అబ్బ.. మండే ఎండల్లో చల్లని కబురు.. ఈ ప్రాంతాల్లో వర్షాలు.. ఇదిగో వచ్చే 3 రోజుల వెదర్ రిపోర్ట్

అబ్బ.. మండే ఎండల్లో చల్లని కబురు.. ఈ ప్రాంతాల్లో వర్షాలు.. ఇదిగో వచ్చే 3 రోజుల వెదర్ రిపోర్ట్


తెలుగు రాష్ట్రాల్లో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో.. తీవ్రమైన వేడి, ఉక్కపోతతో జనం అల్లాడుతున్నారు. చాలా ప్రాంతాల్లో 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్న తరుణంలో హైదరాబాద్ వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. మండే ఎండల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.

హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకారం.. నిన్న ఉత్తర తెలంగాణ మీదుగా కొమరిన్ వరకు ఉన్న ఉపరితల చక్రవాత ఆవర్తనం నుండి ఏర్పడిన ద్రోణి/వాయు అంతరాయం ఇప్పుడు రాయలసీమ నుండి కొమరిన్ ప్రాంతం వరకు, దక్షిణ అంతర్గత కర్ణాటక, తమిళనాడు మీదుగా సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో ప్రయాణిస్తోంది. ఈ రోజు, ఏప్రిల్ 29, 2025, ఉదయం 05:30 గంటలకు ఇది ఉత్తర అంతర్గత కర్ణాటక నుండి మన్నార్ గల్ఫ్ వరకు, దక్షిణ అంతర్గత కర్ణాటక, తమిళనాడు మీదుగా సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో కొనసాగుతోంది.

నిన్న ఉత్తర తెలంగాణ, దాని పరిసర ప్రాంతాలలో సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో ఉన్న ఎగువ వాయు చక్రవాహత ఆవర్తనం బలహీనపడింది.

వీటి ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణం ఈ కింది విధంగా ఉన్నది..

తెలంగాణలో ఈరోజు కొన్ని చోట్ల, గురువారం, శుక్రవారం రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. రాష్ట్రంలో రానున్న మూడు రోజులలో గరిష్ట ఉష్ణోగ్రతలు ఇంచుమించు ఇదే స్థాయిలో కొనసాగే అవకాశం ఉంది.

వాతావరణ హెచ్చరికలు:

ఈరోజు ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు (గాలి వేగం గంటకు 40-50 కి.మీ) వేగంతో పాటు వడగళ్లతో కూడిన వర్షాలు, రేపు, ఎల్లుండి రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులుచ గంటకు 30- 40 కి మీ వేగం కలిగిన ఈదురుగాలులతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *