స్వేచ్ఛ కోసం ఓ కుటుంబం సుదీర్ఘ పోరాటం.. చివరకు..

స్వేచ్ఛ కోసం ఓ కుటుంబం సుదీర్ఘ పోరాటం.. చివరకు..


ఉత్తర కొరియా కఠిన ఆంక్షల నుంచి స్వేచ్ఛా ప్రపంచంలోకి అడుగుపెట్టాలనే ఆశతో ఓ కుటుంబం చేసిన సాహసం సినిమా కథను తలపిస్తోంది. దశాబ్ద కాలం పాటు పక్కా ప్రణాళికతో, ప్రాణాలను పణంగా పెట్టి సముద్ర మార్గంలో వారు జరిపిన ప్రయాణం ఉత్కంఠభరితంగా సాగింది. అయితే, వారు కోరుకున్న స్వేచ్ఛ లభించినా, చివరికి ఆ ఆనందాన్ని విషాదం వెంటాడింది. ఈ ఘటన ఇప్పుడు యావత్‌ ప్రపంచాన్నీ కదిలిస్తోంది. పలాయనం వెనుక దశాబ్ద కాలపు పక్కా ప్రణాళిక ఉంది. కిమ్ ఇల్-హ్యోక్, యి-హ్యోక్ సోదరులు తమ తండ్రి కన్న కల కోసం, ఆయన అస్థికలను వెంట తీసుకుని ఈ ప్రయాణం మొదలుపెట్టారు. ఇందుకోసం కిమ్ యి-హ్యోక్ తీరప్రాంతానికి మకాం మార్చి, చేపలు పట్టడం నేర్చుకుని, సొంతంగా పడవ కొనుగోలు చేశారు. జాలరులుగా నటిస్తూ స్థానిక భద్రతా అధికారులకు లంచాలిచ్చారు. ఇలా ఏళ్ల పాటు నిఘా నౌకల కదలికలను, ప్రతిస్పందన సమయాన్ని గమనించారు. 2023 మే 6న, తుపాను వాతావరణం వారికి కలిసొచ్చింది. రాడార్లకు చిక్కకుండా ఉండేందుకు ఆ రాత్రిని వారు ఎంచుకున్నారు. ఆ సమయంలో మహిళలు, గర్భిణులు కాలినడకన మైన్‌ఫీల్డ్‌ను దాటగా, 4 నుంచి ఆరేళ్ల వయసున్న చిన్నారులను గోనె సంచుల్లో దాచి ఎవరూ శబ్దం చేయకుండా పడవలో ఎక్కించారు. రెండు గంటల పాటు, ఇంజిన్ శబ్దం కూడా రాకుండా నెమ్మదిగా పడవను నడిపారు. రాడార్ తెరపై ఏదో తేలియాడుతున్న వస్తువులా కనిపించేలా జాగ్రత్తపడ్డారు. ఎట్టకేలకు దక్షిణ కొరియాకు చెందిన యోన్‌ప్యోంగ్ దీపం వెలుగులు కనిపించగానే అక్కడి నౌకాదళం వారిని గుర్తించి రక్షించింది. దక్షిణ కొరియాలో అడుగుపెట్టాక వారి జీవితం కొత్త మలుపు తిరిగింది. కుటుంబంలో చిన్నారి జననంతో ఆనందాలు వెల్లివిరిశాయి. కుటుంబమంతా కలిసి ఆ చిన్నారి మొదటి పుట్టినరోజు వేడుకను ఘనంగా జరుపుకున్నారు. కానీ, ఆ సంతోషం ఎక్కువ కాలం నిలవలేదు. ఈ మొత్తం ప్రణాళికకు సూత్రధారి, వారి పలాయనానికి మార్గం సుగమం చేసిన తమ్ముడు కిమ్ యి-హ్యోక్ స్వేచ్ఛ పొందిన 19 నెలలకే ఒక స్కూబా డైవింగ్ ప్రమాదంలో మరణించడం ఆ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. ప్రస్తుతం కిమ్ ఇల్-హ్యోక్ సియోల్‌లో చెఫ్‌గా శిక్షణ పొందుతూ, ఉత్తర కొరియాలోని కఠిన వాస్తవాలను ప్రపంచానికి చాటిచెబుతున్నారు. మార్చి 2026లో ఆయనకు రెండో కుమార్తె జన్మించింది. “ఎన్నో కష్టాలున్నా, నేను అదృష్టవంతుడినే” అని ఆయన తెలిపినా.. వారి ఆనందాల మధ్య ఉన్న ఆ విషాదం ప్రతి ఒక్కరినీ కలచివేస్తోంది. స్వేచ్ఛ కోసం వారు పడిన తపన, చూపిన ధైర్యం చరిత్రలో నిలిచిపోయేదే.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

భార్య కోసం సర్వస్వం అర్పించిన భర్త కన్నీటి గాథ

ఆసుపత్రి నుంచి ఒక్కసారిగా పరుగులు తీసిన పేషంట్లు.. ఏం జరిగిందంటే

ఎండలకు పొట్ట ఉబ్బరమా ?? మీ మీల్ ప్లాన్ ఎలా ఉండాలంటే !!

వేసవిలో ‘సైలెంట్ కిల్లర్‌’ లోలోపలే ఉడికిపోతున్న జనం !! ఏసీలో ఉన్నా తప్పని ముప్పు !!

Chiyaan Vikram: యంగ్ లుక్‌ కోసం రిస్క్‌ చేసిన విక్రమ్‌



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *