హ్యాట్రిక్‌‌పై కన్నేసిన టీమిండియా.. టీ20 ప్రపంచకప్ స్వ్కాడ్‌ చూస్తే ప్రత్యర్థులు డకౌట్.. కెప్టెన్‌గా ఎవరంటే?

హ్యాట్రిక్‌‌పై కన్నేసిన టీమిండియా.. టీ20 ప్రపంచకప్ స్వ్కాడ్‌ చూస్తే ప్రత్యర్థులు డకౌట్.. కెప్టెన్‌గా ఎవరంటే?


T20 World Cup 2028 Team India Squad: ప్రపంచ క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు ఏ జట్టు కూడా వరుసగా మూడుసార్లు టీ20 ప్రపంచకప్ గెలవలేదు. ఈ అరుదైన ఘనతను సొంతం చేసుకునేందుకు భారత సెలెక్టర్లు ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ముఖ్యంగా ఐపీఎల్ 2026లో అసాధారణ ప్రతిభ కనబరుస్తున్న కుర్రాళ్లను గుర్తించి, వారికి అంతర్జాతీయ అనుభవాన్ని అందించాలని బోర్డు నిర్ణయించింది. అనుభవం, యవ్వనం కలగలిసిన జట్టుతో ఆస్ట్రేలియా గడ్డపై సత్తా చాటాలని భారత్ భావిస్తోంది.

సీనియర్, యువ ఆటగాళ్ల కలయిక..

2028 ప్రపంచకప్ జట్టులో 2026 విజేత జట్టులోని కీలక సభ్యులు కొనసాగే అవకాశం ఉంది. సంజు శాంసన్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ వంటి ఆటగాళ్లు తమ స్థానాలను నిలబెట్టుకోనున్నారు. వీరికి తోడుగా బుమ్రా, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్ వంటి స్టార్ బౌలర్లు జట్టుకు వెన్నెముకగా నిలవనున్నారు. వీరి అనుభవం జట్టుకు ఎంతో కీలకం కానుంది.

కొత్త ముఖాలకు పెద్దపీట..

ఈసారి జట్టులోకి కొంతమంది సరికొత్త ఆటగాళ్లు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీతో పాటు రజత్ పాటిదార్, హర్షిత్ రాణాలకు మొదటిసారి ప్రపంచకప్ ఆడే అవకాశం లభించవచ్చు. 2026లో గాయం కారణంగా దూరమైన హర్షిత్ రాణా, ఈసారి తన సత్తా చాటాలని పట్టుదలతో ఉన్నాడు. ఐపీఎల్ 2026లో వీరి ప్రదర్శన సెలెక్టర్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది.

వేదిక ఎక్కడంటే?

2028 టీ20 ప్రపంచకప్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో సంయుక్తంగా జరగనుంది. అక్టోబర్ 21 నుంచి నవంబర్ 19 వరకు ఈ టోర్నీ నిర్వహించనున్నారు. గతంలో 2022లో ఆస్ట్రేలియా ఒంటరిగా ఆతిథ్యం ఇవ్వగా, ఈసారి కీవీ కూడా జతకట్టింది. అక్కడి పిచ్‌లు వేగంగా ఉంటాయని, అందుకే పేస్ బౌలింగ్‌కు అనుకూలించే ఆటగాళ్లను ఎంపిక చేయడంపై బోర్డు దృష్టి పెట్టింది.

టీ20 ప్రపంచకప్ 2028 కోసం భారత ప్రాబబుల్ టీం: సూర్యకుమార్ యాదవ్ / శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), అక్షర్ పటేల్ (వైస్ కెప్టెన్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, శివం దూబే, వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, రజత్ పాటిదార్, తిలక్ వర్మ, హర్షిత్ రాణా, వైభవ్ సూర్యవంశీ.

సూర్యకుమార్ యాదవ్ ఔట్..?

ప్రస్తుతం సూర్యకుమార్ యాదవ్ ఫాంతో అంతగా లేదు. తీవ్రంగా నిరాశపరుస్తున్నాడు. ఈ క్రమంలో బీసీసీఐ మిస్టర్ 360 ప్లేయర్ ను తప్పించాలని చూస్తున్నట్లు వార్తలు వినిపస్తున్నాయి. కాగా, ఐపీఎల్ 2026లో దంచికొడుతోన్న శ్రేయాస్ అయ్యర్ ఈ ప్లేస్ లో వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. అదే జరిగితే శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్ గా రీఎంట్రీ ఇవ్వొచ్చని తెలుస్తోంది.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *