Headlines

Yuzvendra Chahal : రూ.10 లక్షల ఫైన్.. రెండేళ్ల జైలు? చహల్ వివాదంపై డీజీసీఏ సీరియస్ యాక్షన్

Yuzvendra Chahal : రూ.10 లక్షల ఫైన్.. రెండేళ్ల జైలు? చహల్ వివాదంపై డీజీసీఏ సీరియస్ యాక్షన్


Yuzvendra Chahal : టీమిండియా స్పిన్నర్, పంజాబ్ కింగ్స్ స్టార్ యుజ్వేంద్ర చహల్ ఇప్పుడు ఒక కొత్త వివాదంలో చిక్కుకున్నారు. విమాన ప్రయాణంలో నిబంధనలకు విరుద్ధంగా ఆయన వేపింగ్(ఈ-సిగరెట్) చేసినట్లు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. సహచర ఆటగాడు అర్ష్‌దీప్ సింగ్ తీసిన ఒక వ్లాగ్‌లో చహల్ వేపింగ్ చేస్తూ కనిపించారని, ఆ తర్వాత వివాదం కాకుండా సదరు వీడియోను ఎడిట్ చేశారని నెటిజన్లు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై అటు చహల్ గానీ, ఇటు పంజాబ్ కింగ్స్ యాజమాన్యం గానీ ఇంకా అధికారికంగా స్పందించలేదు.

అసలు విమానంలో వేపింగ్ ఎందుకు చేయకూడదు?

విమానాల్లో సిగరెట్లు మాత్రమే కాదు, ఈ-సిగరెట్లు లేదా వేప్స్ వాడటం కూడా అత్యంత ప్రమాదకరం. వేపింగ్ వల్ల వచ్చే పొగ విమానంలోని స్మోక్ డిటెక్టర్లను యాక్టివేట్ చేస్తుంది. దీనివల్ల పైలట్‌కు ప్రమాద సంకేతాలు వెళ్లి, అనవసరంగా విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వస్తుంది. అంతేకాకుండా ఈ పరికరాల్లో ఉండే లిథియం బ్యాటరీల వల్ల అగ్నిప్రమాదం జరిగే అవకాశం కూడా ఉంటుంది. అందుకే ఇండిగో వంటి విమానయాన సంస్థలు వీటిని క్యాబిన్ బ్యాగేజీలో లేదా చెక్-ఇన్ లగేజీలో ఉంచడాన్ని పూర్తిగా నిషేధించాయి.

భారతదేశంలో ఈ-సిగరెట్లపై కఠిన చట్టాలు

కేవలం విమానాల్లోనే కాదు, అసలు భారతదేశంలోనే ఈ-సిగరెట్ల వాడకంపై పూర్తిస్థాయి నిషేధం ఉంది. 2019లో తీసుకువచ్చిన ప్రొహిబిషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్ సిగరెట్స్ యాక్ట్ ప్రకారం.. ఈ-సిగరెట్ల అమ్మకం, ఉత్పత్తి, దిగుమతి, కలిగి ఉండటం నేరం. విదేశాల నుంచి వచ్చే పర్యాటకులు లేదా స్థానికులు ఎవరైనా తమ వ్యక్తిగత అవసరాల కోసం వీటిని విమానాల్లో తీసుకురావడానికి ప్రయత్నిస్తే, వాటిని ఎయిర్‌పోర్టులోనే స్వాధీనం చేసుకుంటారు. ఒకటి కంటే ఎక్కువ పరికరాలు ఉంటే భారీ జరిమానాలు కూడా విధిస్తారు.

జైలు శిక్ష, లక్షల జరిమానా పక్కా

డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) నిబంధనల ప్రకారం.. విమానంలో పొగత్రాగడం లేదా వేపింగ్ చేయడం వంటి చర్యలకు పాల్పడితే ప్రయాణికులను అన్‌రూలీ ప్యాసింజర్‎గా పరిగణిస్తారు. ఇలాంటి సందర్భాల్లో విమాన పైలట్‌కు సదరు వ్యక్తిని విమానం నుంచి దించివేసే అధికారం ఉంటుంది. నేరం నిరూపితమైతే రెండు సంవత్సరాల వరకు జైలు శిక్ష లేదా 10 లక్షల రూపాయల వరకు జరిమానా, లేదా రెండు కలిపి విధించే అవకాశం ఉంది. కొన్నిసార్లు సదరు ఎయిర్‌లైన్స్ ఆ వ్యక్తిని జీవితకాలం నిషేధించే ఛాన్స్ కూడా ఉంటుంది.

సెలబ్రిటీల బాధ్యత ఏది?

కోట్లాది మంది యువత ఆదర్శంగా తీసుకునే క్రికెటర్లు ఇలాంటి చర్యలకు పాల్పడటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చహల్ నిజంగానే వేపింగ్ చేశారా లేదా అనేది ఇంకా నిర్ధారణ కానప్పటికీ, ఈ వీడియో క్లిప్స్ మాత్రం వైరల్ అవుతూనే ఉన్నాయి. నిబంధనల పట్ల అవగాహన ఉండాల్సిన స్టార్ ఆటగాళ్లు ఇలా వివాదాల్లో చిక్కుకోవడం వారి కెరీర్‌తో పాటు టీమ్ ఇమేజ్‌ను కూడా దెబ్బతీస్తుందని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *