Headlines

ఆ హీరో లాంటి మనిషిని ఎక్కడా చూడలేదు.. అతడిని మించిన నటుడు పుట్టలేదు.. కోట శ్రీనివాస రావు..

ఆ హీరో లాంటి మనిషిని ఎక్కడా చూడలేదు.. అతడిని మించిన నటుడు పుట్టలేదు.. కోట శ్రీనివాస రావు..


ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు గతంలో ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరలవుతున్నాయి. ముఖ్యంగా యువ నటులలో అగ్రగణ్యుడిగా జూనియర్ ఎన్టీఆర్‌ను ప్రశంసలతో ముంచెత్తారు. ప్రస్తుత యువ నటులలో జూనియర్ ఎన్టీఆర్‌కు సాటిలేదని కోట శ్రీనివాసరావు స్పష్టం చేశారు. “ఎప్పుడూ చెప్పేది ఒకటే. ఇప్పుడున్న యంగ్ స్టార్స్ లో కొద్దో గొప్పో విషయం ఉండి సత్తా ఉన్నవాడు ఎవడన్నా నటుడు ఎవడన్నా ఉన్నాడంటే వాడే జూనియర్ ఎన్టీఆర్. వాడి తర్వాత ఎవడైనా” అని ఆయన చెప్పారు. ఎన్టీఆర్‌కు ఎవరూ పోటీ కారని, ఆయన ఎవరికీ పోటీ కాదని తెలిపారు. పద్యం అన్నీ ఏ విషయంలోనైనా డైలాగ్ గానీ, డ్యాన్సుల్లో గానీ, రియాక్షన్లలో గానీ విషయం ఉన్నవాడు అని ప్రశంసించారు. జూనియర్ ఎన్టీఆర్ పేరును తన తాతగారు, దివంగత నందమూరి తారక రామారావు గారే పెట్టారని, ఆయన ఒడిలో కూర్చోబెట్టి బొట్టు పెట్టారని కోట శ్రీనివాసరావు గుర్తుచేశారు. ఇది కేవలం ఒక సినీ నటుడి ప్రశంస మాత్రమే కాకుండా, ఒక లెజెండరీ నటుడి వారసత్వాన్ని ధృవీకరించిన విధంగా నిలిచింది.

తెలుగు చిత్ర పరిశ్రమలో మాదక ద్రవ్యాల (డ్రగ్స్) వ్యాప్తిపై కోట శ్రీనివాసరావు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. “ఏముంది డ్రగ్స్ ఏముంది? నువ్వు చేసుకునేది అదే దాన్ని అందుకే మాదక ద్రవ్యాలు అన్నారు. ఆ రోజుల్లో కూడా ఉంది. వ్యభిచారం ఉంది” అని పేర్కొంటూ, ఈ సమస్య పాతదే అయినప్పటికీ, ప్రస్తుత పరిస్థితులలో దాని విస్తృతి పెరిగిందని అన్నారు. మందు తాగడానికి పెర్మిట్ పెట్టిన తర్వాత, ఒంటరిగా తాగడం కంటే నలుగురితో కలిసి తాగడం సరదాగా ఉంటుందని క్లబ్‌లు పెట్టారని, ఇప్పుడు ఆ క్లబ్‌ల స్థానంలో పబ్‌లు వచ్చాయని వివరించారు.

ఇదిలా ఉంటే.. జూనియర్ ఎన్టీఆర్, కోట శ్రీనివాసరావు కలిసి అనేక హిట్ చిత్రాల్లో నటించారు. స్టూడెంట్ నెం. 1, సింహాద్రి, రాఖీ, క్రాంతి, బృందావనం వంటి అనేక చిత్రాల్లో కలిసి నటించారు. ప్రస్తుతం ఎన్టీఆర్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ చిత్రంలో డ్రాగన్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఎక్కువ మంది చదివినవి : ఎక్కువ మంది చదివినవి : Kota Srinivasa Rao : ఆ హీరోలగా చేయాలంటే ఇంకో జన్మ ఎత్తాలి.. ఆరోజు అతడి కష్టాన్ని కళ్లరా చూశా.. కోట శ్రీనివాస్ రావు..

జూనియర్ ఎన్టీఆర్..

Kota Srinivasa Rao, Ntr

Kota Srinivasa Rao, Ntr

ఎక్కువ మంది చదివినవి : ఎక్కువ మంది చదివినవి : Srikanth: ఆ సినిమా తర్వాత నా గ్రాఫ్ మొత్తం పడిపోయింది.. చాలా దెబ్బ పడింది.. హీరో శ్రీకాంత్..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *