Headlines

Weather Report: తెలుగురాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. రాబోయే 3 రోజుల వాతావరణం ఎలా ఉండబోతుందంటే?


ఏపీ, తెలంగాణ వాసులకు భారత వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. దక్షిణ తెలంగాణ, రాయలసీమ, తమిళనాడు మీదుగా గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉన్న అల్పపీడన ద్రోణి ఇవాళ కూడా కొనసాగుతోందని దీని ప్రభావంతో రాష్ట్రాలో రాబోయే మూడు రోజులు పాటు పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది.

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాంలో వర్షాలు

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాంలో రాబోయే మూడు రోజుల పాటు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని.. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంద వాతావరణ శాఖ స్పష్టం చేసింది. బలమైన గాలులు గంటకు 40 -50 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముందని తెలిపింది.

దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్‌లో వర్షాలు

దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్‌లో వర్షాలు సోమవారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని.. మంగళ, బుధ వారంలో భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిచే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముందని.. వేడి , తేమ, అసౌకర్యమైన వాతావరణం ఒకటి లేదా రెండు చోట్ల ఏర్పడే అవకాశముందని తెలిపింది.

రాయలసీమ

ఇక రాయలసీమలో సైతం రాబోయే మూడు రోజులు పాటు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముందని తెలిపింది. అలాగే వర్షాల సమయంలో బలమైన గాలులు గంటకు 40 -50 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముందని తెలిపింది.

తెలంగాణలో వాతావరణం ఇలా

ఇక తెలంగాణలోనూ రాబోయే మూడు రోజుల పాటు రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వాతావరణం శాక తెలిపింది. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడ క్రింది స్థాయి గాలులు గంటకు 30 నుండి 40 కి.మీ వేగంతో వీచే అవకాశం ఉందని స్పష్టం చేసింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *