కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): దశమ స్థానంలో రవి, భాగ్య స్థానంలో బుధ, శుక్రులు, సప్తమంలో గురు, కుజుల సంచారం వల్ల ఏలిన్నాటి శని ప్రభావం బాగా తగ్గిపోతుంది. ఉద్యోగ జీవితంలో కొన్ని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా పురోగమిస్తాయి. ఒత్తిళ్ల నుంచి, సమస్యల నుంచి బాగా ఉపశమనం లభిస్తుంది. అనుకున్నపనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలుంటాయి. కొందరు మిత్రుల వల్ల నష్టపోయే అవకాశం ఉంది. ఉద్యోగంలో పనిభారం పెరుగుతుంది. కొద్ది ప్రయత్నంతో మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. డాక్టర్లు, లాయర్ల వంటి వృత్తుల వారికి ఆశించినంతగా రాబడి పెరుగుతుంది. నిరు ద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగుతాయి.