Headlines

మీ ల్యాప్‌టాప్ క్లీన్ చేసేప్పుడు ఈ ఒక్క పని చేస్తే.. ఇక అంతే !


మారుతున్న కాలానుగుణంగా ప్రస్తుతం మన జీవితంలో ల్యాప్‌టాప్ ఒక భాగమైపోయింది. ముఖ్యంగా ఆఫీస్ వర్క్ అయినా, కాలేజ్ ప్రాజెక్ట్‌లైనా.. ఎంటర్‌టైన్‌మెంట్ అయినా అన్నీ స్క్రీన్ ముందే గడుస్తుంటాయి. ఇలా రోజంతా ఉపయోగించే ల్యాప్‌టాప్ డిస్‌ప్లేపై దుమ్ము, వేలిముద్రలు పడటం సాధారణమే. అయితే ఆ మరకలు కనిపించగానే చేతికి దొరికిన వెట్ వైప్స్, శానిటైజర్లు లేదా కిచెన్ క్లాత్స్‌తో గట్టిగా తుడిచేస్తుంటాం. దీనివల్ల అప్పటికి స్క్రీన్ మెరిసినా.. డిస్‌ప్లే డ్యామేజ్ అయితే రిపేర్ ఖర్చు వేలల్లో ఉంటుంది. మరి ల్యాప్‌టాప్ స్క్రీన్‌ను ఎలాంటి ప్రమాదం లేకుండా ఎలా శుభ్రం చేయాలో ఇప్పుడు చూద్దాం..

ఏ వైప్స్, క్లీనర్స్ అస్సలు వాడకూడదు?

  • ఆల్కహాల్, అమ్మోనియా వైప్స్: వీటిలో ఉండే రసాయనాలు స్క్రీన్ పై ఉండే యాంటీ-గ్లేర్, ఓలియోఫోబిక్ వంటి ప్రొటెక్టివ్ కోటింగ్‌లను కరిగించేస్తాయి. ఫలితంగా కొన్ని రోజులకే స్క్రీన్‌పై తెల్లటి మచ్చలు, ప్యాచెస్ ఏర్పడతాయి.
  • టిష్యూ పేపర్లు, రఫ్ క్లాత్స్: ఇవి తాకడానికి మెత్తగా అనిపించినా, వాటిలోని పీచు వల్ల స్క్రీన్‌పై సన్నని గీతలు (స్క్రాచ్‌లు) పడే అవకాశం ఉంది.
  • గ్లాస్ క్లీనర్స్, సోప్ లిక్విడ్స్: అద్దాలు తుడిచే స్ప్రేలు డిస్‌ప్లే ప్యానెల్‌ను దెబ్బతీస్తాయి. అంతేకాకుండా నేరుగా స్క్రీన్‌పై లిక్విడ్ స్ప్రే చేస్తే.. అది అంచుల నుంచి లోపలికి వెళ్లి షార్ట్ సర్క్యూట్ అయ్యే రిస్క్ ఉంటుంది.

ల్యాప్‌టాప్ స్క్రీన్‌ను శుభ్రం చేసే సరైన పద్ధతి..

  • స్క్రీన్‌ను సేఫ్‌గా క్లీన్ చేయడానికి పెద్దగా కష్టపడాల్సిన పనిలేదు. కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే చాలు అని సూచిస్తున్నారు.
  • ముందుగా ల్యాప్‌టాప్‌ను పూర్తిగా షట్ డౌన్ చేసి ఛార్జింగ్ కేబుల్ తీసేయండి. స్క్రీన్ చల్లారాక తుడిస్తేనే దుమ్ము, మరకలు స్పష్టంగా కనిపిస్తాయి.
  • కళ్లద్దాలు తుడిచుకునే సాఫ్ట్ మైక్రోఫైబర్ క్లాత్ తీసుకుని, గట్టిగా ఒత్తకుండా గుండ్రంగా మెల్లగా తుడవాలి. రోజువారీ దుమ్ము దీనికే ఈజీగా పోతుంది.
  • పొడి గుడ్డతో పోని మొండి మరకల కోసం.. కొద్దిగా డిస్టిల్డ్ వాటర్ లేదా ఆల్కహాల్-ఫ్రీ క్లీనర్‌ను నేరుగా స్క్రీన్‌పై కాకుండా, కేవలం క్లాత్ మీదే స్ప్రే చేసి తుడవాలి. గుడ్డ తడితడిగా మాత్రమే ఉండాలి, నీళ్లు కారకూడదు. తడితో తుడిచిన వెంటనే మరో పొడి మైక్రోఫైబర్ క్లాత్‌తో ఆరనివ్వాలి.
  • ల్యాప్‌టాప్ మూసినప్పుడు కీబోర్డ్ మీద ఉండే జిడ్డు, దుమ్ము స్క్రీన్‌కు అంటుకుంటాయి. అందుకే కీబోర్డ్‌ను కూడా తరచుగా క్లీన్ చేయడం మంచిది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *