పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే, నూనె కొద్దిగా పైకి తేలుతుంది. కూరను ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు చికెన్ , శనగపప్పు పూర్తిగా మునిగేంత వరకు తగినంత నీరు పోయాలి. కూరను హై ఫ్లేమ్‌లో పది నిమిషాలు ఉడికించాలి. దీనివల్ల చికెన్, శనగపప్పు సమానంగా ఉడుకుతాయి. పది నిమిషాల తర్వాత మంటను సిమ్‌లో పెట్టి, ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి. నూనె పైకి తేలి, కూర గ్రేవీ చిక్కగా మారుతుంది. చివరిగా, ఒక స్పూన్ గరం మసాలా, కొద్దిగా కొత్తిమీర వేసి ఒకసారి కలిపి, స్టవ్ ఆపివేయాలి.