Virat Kohli : ఏంటి కోహ్లీ భాయ్ మెడ నరాలు అంతలా ఉబ్బిపోతున్నాయ్.. గిల్‎కు ఈ టైప్ సెండాఫ్ అవసరమా ?

Virat Kohli : ఏంటి కోహ్లీ భాయ్ మెడ నరాలు అంతలా ఉబ్బిపోతున్నాయ్.. గిల్‎కు ఈ టైప్ సెండాఫ్ అవసరమా ?


Virat Kohli : అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా గురువారం రాత్రి జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో అసలైన విరాట్ రూపం కనిపించింది. గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ వికెట్ పడగానే విరాట్ కోహ్లీ ఇచ్చిన సెండ్ ఆఫ్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కోహ్లీ ఆగ్రహం, ఆవేశం చూస్తుంటే ఆ వికెట్ ఆర్సీబీకి ఎంత ముఖ్యమో అర్థమవుతోంది. కేవలం 155 పరుగులకే కుప్పకూలిన డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీకి, గిల్ వికెట్ దక్కగానే కోహ్లీ సంబరాలు అంబరాన్ని తాకాయి.

ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లు కూడా ఆడలేక 155 పరుగులకే ఆలౌట్ అయింది. స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ ఆరంభంలోనే చెలరేగిపోయింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ జోష్ హేజిల్‌వుడ్ వేసిన ఒకే ఓవర్‌లో 2 సిక్సర్లు, 3 ఫోర్లతో విరుచుకుపడ్డాడు. మూడు ఓవర్లలోనే 42 పరుగులు రావడంతో గుజరాత్ గెలుపు ఖాయమనిపించింది. అయితే భువనేశ్వర్ కుమార్ వేసిన లెంత్ డెలివరీని కవర్స్ మీదుగా బాదేందుకు ప్రయత్నించిన గిల్, కోహ్లీ చేతికి చిక్కాడు. ఆ క్యాచ్ అందుకోగానే కోహ్లీ బంతిని నేలకేసి కొట్టి, గట్టిగా అరుస్తూ తన ఆవేశాన్ని ప్రదర్శించాడు.

ఆర్సీబీ ఇన్నింగ్స్‌లో విరాట్ కోహ్లీ అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చాడు. కాగిసో రాబడ వేసిన మొదటి ఓవర్‌లో వరుసగా ఐదు ఫోర్లు కొట్టి 21 పరుగులు పిండుకున్నాడు. ఆ సమయంలో కోహ్లీ 13 బంతుల్లోనే 28 పరుగులు చేసి భీకరంగా కనిపించాడు. కానీ, గిల్ తన ప్రధాన బౌలర్ రాబడపై నమ్మకం ఉంచాడు. రబాడ వెంటనే కోలుకుని కోహ్లీని పెవిలియన్‌కు పంపాడు. కోహ్లీ వికెట్ పడగానే ఆర్సీబీ ఇన్నింగ్స్ పేకమేడలా కూలిపోయింది.

ఏడు ఓవర్లకు 71/2 తో పటిష్టంగా ఉన్న ఆర్సీబీ, ఒక్కసారిగా కుప్పకూలింది. రజత్ పాటిదార్ (19), జితేష్ శర్మ (1), టిమ్ డేవిడ్ (9), కృనాల్ పాండ్యా (4) వరుసగా పెవిలియన్‌కు క్యూ కట్టారు. దీంతో 10.3 ఓవర్లలోనే 96/6 కు పడిపోయి కోలుకోలేకపోయింది. లెఫ్ట్ ఆర్మ్ సీమర్ అర్షద్ ఖాన్ మూడు వికెట్లతో చెలరేగి లోయర్ ఆర్డర్‌ను క్లీన్ చేశాడు. ఈ మ్యాచ్‌లో కోహ్లీ అగ్రెషన్ నెటిజన్లను రెండు వర్గాలుగా చీల్చింది. కొందరు కోహ్లీ ఆట తీరును మెచ్చుకుంటుంటే, మరికొందరు గిల్‌కు అంతటి సెండ్ ఆఫ్ అవసరమా అని ప్రశ్నిస్తున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *