Mobile Alert: మే 2న అందరి ఫోన్‌లలో సైరన్‌ శబ్దం.. ఎందుకు? కంగారు పడకండి.. అసలు కారణం ఇదే!

Mobile Alert: మే 2న అందరి ఫోన్‌లలో సైరన్‌ శబ్దం.. ఎందుకు? కంగారు పడకండి.. అసలు కారణం ఇదే!


Mobile Alert: ఈ మధ్య కాలంలో మీ మొబైల్ ఫోన్ ఒక్కసారిగా పెద్ద శబ్దంతో మోగడం లేదా స్క్రీన్‌పై ఒక వింత మెసేజ్ కనిపించడం జరిగిందా? అలా జరిగితే మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అది ప్రభుత్వం నిర్వహిస్తున్న ఎమర్జెన్సీ అలర్ట్ సిస్టమ్ పరీక్షలో భాగం మాత్రమే. ఈ అలర్ట్‌ అలారం మెసేజ్‌లు మే 2వ తేదీన ఉదయం 11 గంటల నుంచి ఎప్పుడైనా రావచ్చు. అయితే ఈ సైరన్‌ అలర్ట్‌ ఇది వరకు కూడా చాలా మందికి వచ్చాయి. అలాంటి వారు కూడా భయపడాల్సిన అవసరం లేదు.

ఎవరు పంపిస్తున్నారు?

నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ (NDMA), డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (DoT) సంయుక్తంగా ఈ పరీక్షలను నిర్వహిస్తున్నాయి. ఇందుకోసం ‘సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్’ (C-DOT) అభివృద్ధి చేసిన SACHET అనే ప్లాట్‌ఫారమ్‌ను వాడుతున్నారు.

ఇది సాధారణ SMS కంటే ఎలా భిన్నమైనది?

మనం సాధారణంగా పంపే మెసేజ్‌లలా కాకుండా, ఇది సెల్ బ్రాడ్కాస్ట్ (Cell Broadcast) సాంకేతికతపై పనిచేస్తుంది. నెట్‌వర్క్ రద్దీగా ఉన్నా సరే, సెకన్ల వ్యవధిలో నిర్ణీత ప్రాంతంలోని మొబైల్ వినియోగదారులందరికీ ఇది చేరుతుంది. తుఫానులు, భూకంపాలు, సునామీలు లేదా గ్యాస్ లీకేజీల వంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజలను తక్షణమే అప్రమత్తం చేయడానికి ఇది అత్యంత ప్రభావవంతమైన మార్గం.

పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానం

ప్రభుత్వ ‘మేక్ ఇన్ ఇండియా’ చొరవలో భాగంగా ఈ వ్యవస్థను పూర్తిగా మన దేశంలోనే రూపొందించారు. విదేశీ సాంకేతికతపై ఆధారపడకుండా, మన సొంత టెలికాం మౌలిక సదుపాయాలతో దీనిని C-DOT సిద్ధం చేసింది.

పరీక్షలు ఎందుకు జరుగుతున్నాయి?

దేశవ్యాప్తంగా ఈ వ్యవస్థను అధికారికంగా ప్రారంభించే ముందు, దాని పనితీరును, విశ్వసనీయతను తనిఖీ చేయడానికి ప్రస్తుతం ట్రయల్స్ నిర్వహిస్తున్నారు. అందుకే వినియోగదారులకు ఇంగ్లీష్, హిందీతో పాటు వారి ప్రాంతీయ భాషల్లో (తెలుగులో కూడా) మెసేజ్‌లు వస్తున్నాయి. ఈ అలర్ట్ కేవలం టెస్టింగ్ మాత్రమే. భవిష్యత్తులో ఏదైనా ప్రమాదం సంభవించినప్పుడు ప్రజల ప్రాణాలను కాపాడటానికి ప్రభుత్వం చేపట్టిన ఒక గొప్ప ముందడుగు ఇది. అందుకే నిర్భయంగా ఉండండి.

ముఖ్య గమనిక:

  • నెట్‌వర్క్ టవర్లను బట్టి మీకు ఒకటి కంటే ఎక్కువసార్లు ఈ అలర్ట్ రావచ్చు.
  • ఈ మెసేజ్ వచ్చినప్పుడు మీరు ఎలాంటి రియాక్షన్ ఇవ్వక్కర్లేదు. కేవలం ‘OK’ క్లిక్ చేస్తే సరిపోతుంది.
  • మీ ఫోన్ సెట్టింగ్స్‌లో Safety and Emergency > Wireless Emergency Alerts > Test Alerts ఆన్‌లో ఉంటేనే ఇవి వస్తాయి.

దీనివల్ల లాభం ఏంటంటే

  • ఏదైనా ప్రమాదం పొంచి ఉన్నప్పుడు సెకన్ల వ్యవధిలో వేలమందికి సమాచారం చేరుతుంది.
  • వరదలు లేదా తుఫానులు వచ్చే ముందు హెచ్చరికలు పంపడం ద్వారా ప్రాణ నష్టాన్ని తగ్గించవచ్చు.
  • ప్రమాదం ఉన్న ప్రాంతంలో ఉన్న ఫోన్లకు మాత్రమే ఈ మెసేజ్‌లు వెళ్లేలా ఈ టెక్నాలజీని రూపొందించారు.
  • గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే.. మే 2, 2026న మీ ఫోన్‌లో సైరన్ మోగినా లేదా ఎమర్జెన్సీ అలర్ట్ అని మెసేజ్ వచ్చినా అది ప్రభుత్వం చేస్తున్న చిన్న టెస్టింగ్ అని గమనించండి. అలాగే భయపడకుండా ఇతరులకు కూడా ఈ విషయం తెలియజేయండి. మీ ఫోన్ సైలెంట్ మోడ్‌లో ఉన్నా కూడా ఈ సైరన్ వినిపించే అవకాశం



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *