Headlines

Viral Video: ఇలా ఉన్నారేంట్రా సామీ..! కాటేసిన కోబ్రాను డబ్బాలో పెట్టి ఆస్పత్రికి తీసుకెళ్లిన యువకుడు.. షాకింగ్‌ సీన్‌తో రోగులు పరోగు పరుగు

Viral Video: ఇలా ఉన్నారేంట్రా సామీ..! కాటేసిన కోబ్రాను డబ్బాలో పెట్టి ఆస్పత్రికి తీసుకెళ్లిన యువకుడు.. షాకింగ్‌ సీన్‌తో రోగులు పరోగు పరుగు


ఉత్తరాఖండ్‌లోని నైనితాల్ జిల్లాలో ఒక విచిత్రమైన సంఘటన చోటుచేసుకుంది. పాములను రక్షించే స్నేక్ క్యాచర్‌ ఒక ఇంట్లోకి చొరబడిన ప్రమాదకరమైన కోబ్రా పామును పట్టుకునే క్రమంలో, అది అతని చేతి వేలిపై కాటు వేసింది. అయినా సరే ధైర్యం వీడని ఆ యువకుడు ఆ విషసర్పాన్ని ప్లాస్టిక్ డబ్బాలో బంధించి, దాన్ని పట్టుకుని నేరుగా ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాడు. డబ్బాలోని పామును చూసి ఆసుపత్రి వైద్యులు, రోగులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వైద్యులు వెంటనే అతనికి యాంటీ వెనమ్ ఇచ్చి చికిత్స ప్రారంభించడంతో ప్రమాదం తప్పింది. పూర్తి వివరాల్లోకి వెళితే…

ఉత్తర ప్రదేశ్‌లోని మురాదాబాద్‌కు చెందిన అరుణ్ కుమార్ అనే యువకుడు గత కొన్నేళ్లుగా రామ్‌నగర్‌లో నివసిస్తూ టైల్స్ పనులు చేస్తుంటాడు. వీటితో పాటు స్థానికంగా పాములు కనిపిస్తే వాటిని సురక్షితంగా రక్షించి అడవిలో విడిచిపెట్టే స్నేక్ రెస్క్యూయర్‌గా కూడా పనిచేస్తున్నాడు. రామ్‌నగర్ పరిధిలోని గుబాన్‌పూర్ గ్రామంలోని ఒక ఇంట్లోకి సుమారు ఐదు అడుగుల పొడవున్న ప్రమాదకరమైన కోబ్రా పాము వచ్చి చేరింది. స్థానికుల సమాచారంతో అరుణ్ అక్కడకు చేరుకుని పామును పట్టుకోవడానికి ప్రయత్నించాడు.

పామును పట్టుకుని బంధించే క్రమంలో, కోబ్రా ఒక్కసారిగా అరుణ్ కుడిచేతి చూపుడు వేలిపై కాటు వేసింది. తీవ్రమైన నొప్పితో పాటు బాధితుడి శరీరంపై విష ప్రభావం చూపే ప్రమాదం ఉన్నప్పటికీ అరుణ్ అస్సలు భయపడలేదు. ఎంతో సమయస్ఫూర్తితో, ధైర్యంతో ఆ పామును ప్లాస్టిక్ డబ్బాలో బంధించి మూత పెట్టేశాడు.

ఇవి కూడా చదవండి



పామును డబ్బాలో పెట్టుకుని అరుణ్ నేరుగా రామ్‌నగర్‌లోని రామ్‌దత్ సంయుక్త ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నాడు. అత్యవసర విభాగంలోకి వెళ్లి, నన్ను ఈ పామే కాటు వేసింది అంటూ డబ్బాలోని విషసర్పాన్ని వైద్యులకు చూపించాడు. డబ్బాలో ప్రాణాలతో ఉన్న నల్లత్రాచును చూసి ఆసుపత్రి సిబ్బంది, మిగతా రోగులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

ఈ విచిత్ర ఘటనతో మొదట ఆశ్చర్యపోయిన వైద్యులు, పరిస్థితి తీవ్రతను గ్రహించి వెంటనే అరుణ్‌కు యాంటీ-వెనమ్ ఇంజెక్షన్లు ఇచ్చి అత్యవసర చికిత్స ప్రారంభించారు. సరైన సమయంలో చికిత్స అందడంతో అతనికి ముప్పు తప్పినట్లు వైద్యులు తెలిపారు. విషసర్పం కాటు వేసినప్పటికీ కంగారు పడకుండా పామును రక్షించి, ఆపై చికిత్స కోసం ఆసుపత్రికి వచ్చిన అరుణ్ సాహసాన్ని స్థానికులు అభినందిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *