Headlines

Video: వామ్మో.. 140 కి.మీల బౌన్సర్‌తో కుప్పకూలిన ఆసీస్ స్టార్.. రక్తంతో మైదానం బయటకు..!


Cameron Green Injury Video: గెలుపోటములను మించిన విషాద క్షణం బెల్లెరీవ్ ఓవల్‌లో ఆవిష్కృతమైంది. ఇంగ్లండ్ నిర్దేశించిన 329 పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తున్న ఆస్ట్రేలియాకు 27వ ఓవర్ చివరి బంతి పిడుగుపాటుగా మారింది. ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్ నోటి నుంచి రక్తం కారుతుండగా మైదానం వీడాడు.

అసలేం జరిగింది?

రెండో ఇన్నింగ్స్‌లో మ్యాట్ రెన్‌షా 55 పరుగుల వద్ద ఔట్ కాగా గ్రీన్ క్రీజులోకి వచ్చాడు. 27వ ఓవర్ చివరి బంతిని గస్ అట్కిన్సన్ 140.8 కి.మీ వేగంతో షార్ట్ బౌన్సర్‌గా సంధించాడు. పుల్ షాట్‌కు ప్రయత్నించిన గ్రీన్ అంచనా తప్పింది. బంతి ఊహించిన దానికంటే ఎక్కువ ఎగసింది.

ఇవి కూడా చదవండి



ఎక్కువమంది చదివినది: IPL 2027 Retention: రిటెన్షన్ తర్వాత మారిన లెక్కలు.. పవర్ ఫుల్ టీం, వరస్ట్ టీంలు ఏవో తెలుసా..?

బ్యాట్‌ను తప్పించుకున్న బంతి నేరుగా హెల్మెట్ గ్రిల్‌ను, నోటి సమీపంలో తాకింది. తీవ్ర ధాటికి గ్రీన్ సమతూకం కోల్పోయి నేలపై కూలిపోయాడు. ఇనుప గ్రిల్ నోటికి, పెదవులకు గుచ్చుకుని గాయమై రక్తస్రావం ప్రారంభమైంది. వెంటనే హెల్మెట్, గ్లౌజ్ తీసి గాయాన్ని చూసుకున్నాడు. ఆస్ట్రేలియా మెడికల్ సిబ్బంది పరుగున వచ్చి ప్రాథమిక చికిత్స అందించి మైదానం నుంచి తీసుకెళ్లారు. ఆ సమయానికి గ్రీన్ 11 బంతుల్లో 3 పరుగులే చేశాడు. జట్టు విజయానికి ఇంకా 180 పరుగులు అవసరం.

మళ్లీ బ్యాటింగ్‌కు వస్తాడా? కంకషన్ కలకలం..

నిబంధనల ప్రకారం గ్రీన్ ఔట్ కాలేదు, రిటైర్డ్ హర్ట్ మాత్రమే. కోలుకుంటే మళ్లీ బ్యాటింగ్‌కు రావచ్చు. కానీ దెబ్బ తలకు తగలడంతో కంకషన్ పరీక్ష తప్పనిసరైంది. కొత్త నిబంధనల ప్రకారం కంకషన్ నిర్ధారణ అయితే ప్రత్యామ్నాయ ఆటగాడిని తీసుకోవచ్చు. తాజా సమాచారం ప్రకారం గ్రీన్‌లో కంకషన్ లక్షణాలు కనిపించడంతో ఆస్ట్రేలియా ఒలివర్ పీక్‌ను ప్రత్యామ్నాయంగా పిలిచింది. ఇకపై పీక్ బ్యాటింగ్ చేస్తాడు, గ్రీన్ ఈ మ్యాచ్‌లో మళ్లీ పాల్గొనలేడు.

ఎక్కువమంది చదివినది: Video: 13 సిక్సర్లు, 8 ఫోర్లతో ఊహించని విధ్వంసం.. 281 స్ట్రైక్‌రేట్‌తో కోహ్లీ దోస్త్ రికార్డుల మోత..!

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *