Headlines

Meena : ఆ హీరోతో ఓ సీన్‏లో స్విమ్‌సూట్‌లో కనిపించా.. వాళ్లంతా నన్ను తిట్టారు.. హీరోయిన్ మీనా..


ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీలో అగ్ర కథానాయికగా ఓ వెలుగు వెలిగిన హీరోయిన్ మీనా. తెలుగు, తమిళం, మలయాళం భాషలలో అనేక హిట్ చిత్రాల్లో నటించి మెప్పించారు. బాలనటిగా తెరంగేట్రం చేసిన ఆమె.. ఇప్పటికీ సినిమాల్లో వైవిధ్యమైన పాత్రలు పోషిస్తూ బిజీగా ఉంటున్నారు. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మీనా.. తన కెరీర్‌లో ప్రభుదేవాతో కలిసి నటించిన ఓ చిత్రంలో స్విమ్‌సూట్ ధరించిన సన్నివేశంపై తన అనుభవాలను, ఆ తర్వాత అభిమానుల నుంచి వచ్చిన స్పందనను వివరించారు. ఆ సమయంలో ఆ సన్నివేశంలో నటించడం తనకు ఎంతో అసౌకర్యాన్ని కలిగించిందని, మేకప్ రూమ్ నుంచి బయటకు రావడానికి కూడా తాను ఇబ్బంది పడ్డానని ఆమె గుర్తు చేసుకున్నారు. “ఓ మై గాడ్, నేను స్విమ్‌సూట్ ధరించాను. అది ప్రభుదేవా సినిమా అనుకుంటా. చుట్టుపక్కల వారి ప్రభావం వల్ల, నేనూ ప్రయత్నించాలనిపించింది. నా వల్ల కూడా అవుతుంది కదా అనిపించింది. కానీ అది ధరించిన క్షణం నుంచి నాకు అసౌకర్యంగా అనిపించింది. మేకప్ రూమ్ నుంచి బయటకు వెళ్లడానికి ఇష్టం లేదు. ఈ డ్రెస్ వేసుకుని నేను ఎలా బయటకు వెళ్ళాలి, ఎలా పెర్ఫార్మ్ చేయాలి, డాన్స్ చేయాలి అనిపించింది. నేను చాలా అన్‌కంఫర్టబుల్‌గా ఉన్నాను” అని మీనా తన అంతర్గత సంఘర్షణను పంచుకున్నారు. ఆ సమయంలో ఇతర హీరోయిన్లు ఇలాంటి సన్నివేశాలు ఎలా చేస్తున్నారో అనిపించి, వారి కాళ్ళు మొక్కుకోవాలని నిజంగా అనుకున్నానని ఆమె తెలిపారు.

ఎక్కువ మంది చదివినవి : KS Chitra : తెలుగులో పెద్ద హీరోయిన్.. ఆమెకు పాట పాడితే నా గొంతుకు 2 రోజులు రెస్ట్ ఇచ్చేదాన్ని.. చిత్ర..

అయితే, సినిమాల విషయంలో ఒకసారి కమిట్‌మెంట్ ఇస్తే దాన్ని తప్పక నెరవేర్చాలనే నిబద్ధతతోనే ఆ సన్నివేశంలో నటించినట్లు మీనా వివరించారు. “ఒప్పుకున్నాను. అక్కడికి వచ్చిన తర్వాత ఇది చేయలేను అని చెప్పలేము. సరే ఓకే, దీన్ని ప్రయత్నించాలనుకున్నాం, ప్రయత్నిద్దాం, మర్చిపోదాం అన్నట్టు ముందుకు వెళ్లి చేశాను,” అని ఆమె అన్నారు. ఆ సన్నివేశం కేవలం ఒక్కసారి మాత్రమే చేసి, ఆ తర్వాత అలాంటివి తన శైలి కాదని వదిలేసినట్లు పేర్కొన్నారు. ఈ సన్నివేశంపై ప్రేక్షకుల స్పందన ఊహించిన దానికంటే భిన్నంగా ఉందని మీనా తెలిపారు. “ఆడియన్స్ కూడా నాకు తెలిసి అదిరిపోయి ఉంటారు ఆ సీన్ చూసి. మీనా ఏంటి ఇలాగ అని. చాలా మంది అమ్మో మీరు కూడా ఇది చేశారా? అని అడిగితే, మరికొందరు మీరు కూడా ఎందుకండి చేశారు? అన్నట్లుగా స్పందించారు. అప్పుడే నాకు అర్థమైంది, బహుశా ప్రజలు నన్ను అలాంటి రూపంలో చూడటానికి అంత ఆసక్తి చూపడం లేదని,” అని మీనా వెల్లడించారు.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : ఒక్క పాట కోసం 365 రోజులు థియేటర్లు షేక్ అయ్యాయి.. అప్పట్లో టాప్ లేపేసిన సాంగ్..

తాను ఎప్పుడూ “పక్కింటి అమ్మాయి”లాంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉన్నానని, తన కెరీర్‌లో చేసిన పాత్రలు కూడా ఆ ఇమేజ్‌ను నిలబెట్టాయని ఆమె అన్నారు. రెమ్యూనరేషన్ లేదా ఇతరత్రా కారణాల వల్ల గ్లామర్ పాత్రలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబడే పరిశ్రమలో, ఒకానొక దశలో తానూ గ్లామర్ పాత్రలు చేయాలని ఆలోచించానని మీనా అంగీకరించారు. అయితే, అభిమానుల స్పందన, తన అంతర్గత భావనల వల్ల అలాంటి ప్రయత్నాలకు దూరంగా ఉండడమే సరైనదని మీనా నిర్ణయించుకున్నట్లు తెలిపారు.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : 1965లోనే లక్షలతో తీసిన బాలనాగమ్మ సినిమా.. షూటింగ్ పూర్తైన ఎందుకు రిలీజ్ కాలేదంటే..

ఎక్కువ మంది చదివినవి : Cinema : మెంటలెక్కించే ట్విస్టులు.. క్లైమాక్స్ చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే.. ఓటీటీని షేక్ చేస్తున్న 7 ఎపిసోడ్స్..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *