Headlines

మేల్కొనకపోతే రాజకీయ భవిష్యత్ కోల్పోతారు.. ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు వార్నింగ్..


హలో ఎమ్మెల్యేలు.. మేల్కొనకపోతే రాజకీయ భవిష్యత్ కోల్పోతారు అంటూ సీఎం చంద్రబాబు నాయుడు పలువురికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు సాధించని ఎమ్మెల్యేలపై చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఫలితాలపై పూర్తిస్థాయి సమీక్ష తర్వాత యాక్షన్ తప్పదన్నారు. ఆయా ఎమ్మెల్యేలు తమ పనితీరును మార్చుకోవాలని హెచ్చరించారు. కొన్ని నియోజకవర్గాల్లో ప్రజల నుంచి వచ్చిన తీర్పుపై సమీక్ష చేసుకోవాలని సూచించారు. కొందరు ఎమ్మెల్యేల పనితీరును ప్రజలు ఆమోదించలేదని భావించాలన్నారు. ఫలితాల చూసైనా రియలైజ్‌ కావాలని చంద్రబాబు సూచించారు.

ప్రజాప్రతినిధులుగా ఉన్నవారు బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు చంద్రబాబు. ప్రతి ఫలితాన్నీ విశ్లేషిస్తామన్నారు. తీరు మార్చుకోకపోతే చర్యలు తప్పవన్నారు. కొత్తగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు సైతం హద్దులు దాటొద్దన్నారు. పంచాయతీ ఎన్నికల్లో కూటమి బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించేలా ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు సమష్టిగా పని చేయాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు.

పదవుల కోసం అలకలు సరికాదు: చంద్రబాబు

పరిషత్ పీఠాల కోసం పౌరుషాలకు పోతున్నారు కూటమిలోని కొందరు నేతలు. కడప జడ్పీ చైర్మన్ పీఠం విషయంలో ఆదినారాయణ రెడ్డి బహరంగంగా అసంతృప్తి వ్యక్తం చేశారు. శ్రీకాళహస్తి ఎంపీపీ సీటు కోసం టీడీపీ-బీజేపీ పట్టుబడటంతో మరోసారి ఎంపీపీ ఎన్నిక వాయిదా వేయాల్సి వచ్చింది. మరోవైపు పరిషత్ పీఠాల విషయంలో కూటమి నిర్ణయమే ఫైనల్ అంటూ సీఎం చంద్రబాబు స్పష్టంచేశారు. టీడీపీలో ముగ్గురు అలిగారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరికి కౌన్సెలింగ్ ఇస్తామన్నారు. వినకపోతే చర్యలు తీసుకుంటామన్నారు. బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి తీరుపైనా ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు. పదవుల కోసం అలకలు సరికాదంటూ పేర్కొన్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *