Headlines

దేశంలో తొలి బుల్లెట్ ట్రైన్‌పై మరో అప్డేట్.. . కీలక ఘట్టం పూర్తి.. కేంద్రం తాజా ప్రకటన


దేశంలో తొలి బుల్లెట్ రైలుపై బిగ్ అప్డేట్ వచ్చింది. వచ్చే ఏడాది ఆగస్ట్ 15న తొలి బుల్లెట్ రైలును పరుగులు పెట్టించే దిశగా రైల్వేశాఖ వడివడిగా అడుగులు వేస్తోంది. హైస్పీడ్ బుల్లెట్ రైల్ కారిడార్ పనులను వేగవంతంగా పూర్తి చేస్తోంది. అహ్మదాబాద్-ముంబై హైస్పీడ్ కారిడార్‌లోని తొలి బుల్లెట్ రైలును ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ మార్గంలోని సూరత్-బిలిమోరా మధ్య తొలి బుల్లెట్ ట్రైన్ నడపనుండగా.. ఇప్పటికే ఈ రూట్ల మధ్య పనులు దాదాపుగా పూర్తి కావొచ్చాయి. తాజాగా ఈ ట్రాక్‌లో విద్యుత్ సరఫరా ప్రారంభించారు. ఈ ప్రాజెక్టులో ఇది పెద్ద చారిత్రాత్మక ఘట్టంగా చెప్పవచ్చు. దీనికి సంబంధించి నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ వివరాలను తన ఎక్స్ ఖాతాలో పంచుకుంది.

సూరత్-బిలిమోరా మధ్య తొలి 50 కిలోమీటర్లలో ఓవర్ హెడ్ ఎక్విప్‌మెంట్ ద్వారా విద్యుత్ సరఫరా చేయనున్నట్లు నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ స్పష్టం చేసింది. అధునాతన 2 × 25 kV ఓవర్‌హెడ్ ట్రాక్షన్ సిస్టమ్‌ ఏర్పాటు చేస్తుండగా.. ఇందులో ఎలివేటెడ్ అలైన్‌మెంట్‌పై అప్, డౌన్ లైన్లు రెండూ ఉన్నాయని తెలిపింది. ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు ప్రాజెక్టు 508 కిలోమీటర్ల మేర ఉంటుంది. ఈ మార్గం మధ్యలో మొత్తం 14 ట్రాక్షన్ సబ్‌స్టేషన్లను నిర్మించనున్నారు. 9 సబ్‌స్ట్రేషన్లు గుజరాత్‌లో ఉండనుండగా.. ఐదు వచ్చేసి మహారాష్ట్రలో ఉంటాయి. ఈ సబ్‌స్టేషన్లు గ్రీడ్ నుంచి విద్యుత్‌ను సేకరించి ఓవర్ హెడ్ ట్రాక్షన్ సిస్టమ్ ద్వారా కసరఫరా చేస్తాయి. ఒక ఒక ప్రత్యేకమైన సెంటర్ ద్వారా విద్యుత్ వ్యవస్థను పర్యవేక్షిస్తారు.

అహ్మదాబాద్-ముంబై కారిడార్ మహారాష్ట్ర, గుజరాత్, దాద్రా నగర్ హావేలీ గుండా వెళుతుంది. మొత్తం 12 స్టేషన్లు ఉంటాయి. ముంబై (బీకేసీ), థానే, విరార్, బోయిసర్, వాపి, బిలిమోరా, సూరత్, భరూచ్, వడోదర, ఆనంద్, అహ్మదాబాద్, సబర్మతి లాంటి ప్రధాన స్టేషన్లు ఉన్నాయి. బుల్లెట్ రైళ్లు గంటకు 320 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే సామర్థ్యం కలిగి ఉంటాయి. బుల్లెట్ రైళ్లు సగటున 300 కిలోమీటర్ల వేగంతో ఈ మార్గంలో ప్రయాణించనుంది. బుల్లెట్ రైళ్లలో కాంపౌండ్ కాటెనరీ సిస్టమ్ వ్యవస్థను ప్రవేశపెడుతున్నారు. ఈ సాంకేతికత రైళ్లకు అత్యంత వేగంగా ప్రయాణించగలిగే సామర్థ్యాన్ని అందిస్తుంది. కాంపౌండ్ కాటెనరీ సిస్టమ్ అనేది రైల్వే విద్యుదీకరణలో ఒక అధునాతన వ్యవస్థగా చెబుతున్నారు. ఇందులో భాగంగా ప్రధాన కాటెనరీ వైర్, కాంటాక్ట్ వైర్ మధ్య ఒక అదనపు సహాయక వైర్‌ను అమర్చుతారు. దీని ద్వారా హై-స్పీడ్ రైళ్లకు నిరంతరాయంగా, స్థిరమైన విద్యుత్ సరఫరా అందుతుంది



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *