Headlines

Tollywood: తోపు డైరెక్టర్ పిల్లలు.. కొడుకు క్రేజీ హీరో.. ఈ ఇద్దరు చిన్నారులు ఎవరో గుర్తుపట్టారా..?

Tollywood: తోపు డైరెక్టర్ పిల్లలు.. కొడుకు క్రేజీ హీరో.. ఈ ఇద్దరు చిన్నారులు ఎవరో గుర్తుపట్టారా..?


టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ కుటుంబంపై సోషల్ మీడియాలో ఎప్పుడూ ప్రత్యేకమైన ఆసక్తి ఉంటుంది. తాజాగా ఆయన కుమారుడు, యువ హీరో ఆకాష్ జగన్నాథ్ పుట్టినరోజు సందర్భంగా ఆకాష్ సోదరి, పూరి జగన్నాథ్ కుమార్తె పవిత్ర పూరి తన అన్నయ్యపై ఉన్న ప్రేమాభిమానాలను తెలియజేస్తూ ఇన్స్టాగ్రామ్‌లో పంచుకున్న అరుదైన ఫోటోలు ప్రస్తుతం నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. పవిత్ర తన సోషల్ మీడియా ఖాతాలో ఆకాష్ చిన్నప్పటి క్యూట్ అండ్ మెమోరబుల్ పిక్స్ షేర్ చేస్తూ.. అతనికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. చిన్నతనంలో ఇద్దరూ కలిసి సరదాగా గడిపిన క్షణాలు, పూరి జగన్నాథ్ తో కలిసి వారు దిగిన అరుదైన ఫ్యామిలీ ఫోటోలు ఈ గ్యాలరీలో సందడి చేస్తున్నాయి. అన్నయ్యతో తనకున్న అనుబంధాన్ని, చిన్నప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ పవిత్ర పెట్టిన ఈ పోస్ట్ నెటిజన్లతో పాటు పూరి అభిమానులను కూడా బాగా ఆకట్టుకుంది. ఈ పిక్స్ చూసిన అభిమానులు, సినీ ప్రముఖులు ఆకాష్ జగన్నాథ్‌కు సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షల వర్షం కురిపిస్తున్నారు.

ఎక్కువ మంది చదివినవి : Krishna Vamsi: అతడిని డైరెక్టర్ చేయాలని సినిమా స్టార్ట్ చేశా.. ఎంతో ఫోర్స్ చేశా.. కానీ ఇప్పుడు పెద్ద నటుడు అయ్యాడు.. కృష్ణ వంశీ..

చైల్డ్ ఆర్టిస్ట్‌గా ‘చిరుత’, ‘బుజ్జిగాడు’, ‘బిజినెస్ మేన్’ వంటి సినిమాల్లో మహేష్ బాబు, ప్రభాస్ వంటి స్టార్ హీరోల చిన్ననాటి పాత్రలతో మెప్పించిన ఆకాష్ జగన్నాథ్, ఆ తర్వాత ‘మెహబూబా’ సినిమాతో హీరోగా పరిచయమయ్యారు. అనంతరం ‘రొమాంటిక్’ చిత్రంతో తన నటన, మేకోవర్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తనదైన నటనతో మాస్, యూత్ ఆడియన్స్‌ను ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తున్న ఆకాష్, ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నారు.

ఎక్కువ మంది చదివినవి : రోజుకు 15000 అడుగులు నడుస్తా.. టిఫిన్లు అస్సలు చేయను.. 86 ఏళ్ల వయసులో ఇంత ఫిట్‏గా.. మురళీ మోహన్ డైట్ సీక్రెట్ ఇదే..

అన్నయ్య పుట్టినరోజు సందర్భంగా పవిత్ర పూరి షేర్ చేసిన ఈ థ్రోబ్యాక్ పిక్స్ ప్రస్తుతం టాలీవుడ్ సర్కిల్స్‌లో, నెట్ ఇంట బాగా వైరల్ అవుతున్నాయి. ఈ క్యూట్ ఫోటోలు చూసిన అభిమానులు ‘హ్యాపీ బర్త్ డే ఆకాష్’ అంటూ కామెంట్ల రూపంలో తమ ప్రేమను తెలుపుతున్నారు.

ఎక్కువ మంది చదివినవి : Bigg Boss 10 Telugu : బి‏గ్ బాస్‏లో జబర్దస్త్ క్రేజీ బ్యూటీ.. ఆఫర్ రావడంపై స్పందించిన గ్లామరస్ క్వీన్.. ఏమన్నారంటే..

పవిత్ర పూరి పోస్ట్..

ఎక్కువ మంది చదివినవి : Aishwarya Rajesh: అతడంటే క్రష్ కాదు పిచ్చి ఇష్టం.. తన కోసం చాలా ట్రై చేశా.. కానీ అంతలోనే తిరిగిరాని లోకాలకు.. ఐశ్వర్య రాజేశ్..





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *