Headlines

IND vs ZIM 2nd T20I: హాఫ్ సెంచరీలతో అదరగొట్టిన తిలక్, ఇషాన్.. జింబాబ్వే ముందు భారీ టార్గెట్..

IND vs ZIM 2nd T20I: హాఫ్ సెంచరీలతో అదరగొట్టిన తిలక్, ఇషాన్.. జింబాబ్వే ముందు భారీ టార్గెట్..


జింబాబ్వేతో జరిగిన రెండో టీ20లో భారత్ టాస్ ఓడినా అద్భుతంగా ఆకట్టుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్నీత 20 ఓవర్ల 5 వికెట్లు కోల్పోయి 219 పరుగులు చేసింది. దీంతో జింబాబ్వే ముందు 220 పరుగుల టార్గెట్ అందించింది. వైభవ్ సూర్యవంశీ 9 బంతుల్లో 20 పరుగులు చేసి అవుటయ్యాడు. అభిషేక్ శర్మ 8 పరుగులకు అవుటయ్యాడు. ఇషాన్ కిషన్ 81 (44 బంతులుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లు) పరుగులతో జింబాబ్వే బౌలర్లను చీల్చి చెండాడాడు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 25 పరుగుల వద్ద బ్రయాన్ బెన్నెట్ బౌలింగ్‌లో అవుటయ్యాడు.

మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా రెండో మ్యాచ్ నేడు హరారేలో జరుగుతోంది. టాస్ గెలిచిన జింబాబ్వే మొదట బౌలింగ్ ఎంచుకుంది. సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలో ఉంది.

ఇరుజట్ల ప్లేయింగ్ 11..

భారత్: అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ, రింకూ సింగ్, శివమ్ దూబే, రవి బిష్ణోయ్, ప్రిన్స్ యాదవ్, మయాంక్ యాదవ్, యశ్ ఠాకూర్.

జింబాబ్వే: బ్రియాన్ బెన్నెట్, బెన్ కర్రాన్, డియోన్ మైయర్స్, సికందర్ రజా (కెప్టెన్), ర్యాన్ బర్ల్, వెస్లీ మాధవెరె, తాడివానాషే మారుమణి, బ్రాడ్ ఎవాన్స్, న్యూమాన్ న్యామ్‌హురి, రిచర్డ్ న్గర్వా, బ్లెస్సింగ్ ముజారబానీ.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *