Headlines

Neech Shukra: శుక్రుడి నీచ స్థితితో ఆ రాశుల వారికి కష్టనష్టాలు..! ఈ పరిహారాలు చేయండి

Neech Shukra: శుక్రుడి నీచ స్థితితో ఆ రాశుల వారికి కష్టనష్టాలు..! ఈ పరిహారాలు చేయండి


ఆగస్టు 2 నుంచి సెప్టెంబర్ 2 వరకు నెల రోజుల పాటు శుక్రుడు కన్యా రాశిలో నీచపడడం జరుగుతోంది. జీవిత భాగస్వామి, ప్రేమలు, పెళ్లిళ్లు, సుఖ సంతోషాలు, భోగభాగ్యాలకు కారకుడైన శుక్రుడు నీచ స్థితిలో ఉండే పక్షంలో కొన్ని రాశులకు ఈ కారకత్వాలు బాగా బలహీనపడే అవకాశం ఉంది. ఈ రాశుల వారు లలితా సహస్రనామ స్తోత్రాన్ని రోజూ పఠించడంతో పాటు, కందులు దానం చేయడం మంచిది. ప్రేమ జీవితంలోనే కాక, వైవాహిక జీవితంలో కూడా కొద్దిగా ఓర్పు, సహనాలతో వ్యవహరించడం మంచిది. మేషం, కర్కాటకం, కన్య, తుల, కుంభం, మీన రాశులవారికి శుక్రుడికి సంబంధించినంత వరకూ పరిస్థితులు అనుకూలంగా ఉండకపోవచ్చు.

మేషం

ఈ రాశికి షష్ట స్థానంలో శుక్రుడు నీచబడడం వల్ల వైవాహిక జీవితంలో సమస్యలు తలెత్తే అవ కాశం ఉంది. సతీమణి అనారోగ్యానికి గురి కావడం గానీ, దాంపత్య జీవితం అనుకూలంగా సాగక పోవడం గానీ జరుగుతుంది. ప్రేమ వ్యవహారాల్లో అపార్థాలు చోటు చేసుకుంటాయి. బంధు మిత్రుల ద్వారా ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. ఊహించని శత్రుత్వాలు ఏర్పడతాయి. వృత్తి, వ్యాపారాల్లో పోటీ పెరుగుతుంది. ఉద్యోగంలో ఒకటి రెండు పొరపాట్లు జరిగే అవకాశం ఉంది.

కర్కాటకం

ఈ రాశికి తృతీయ స్థానంలో శుక్రుడు నీచబడడం వల్ల ఆర్థిక ప్రయత్నాలు ఆశించిన స్థాయిలో ఫలించకపోవచ్చు. ప్రయాణాల్లో విలువైన వస్తువులు, పత్రాలు కోల్పోయే సూచనలున్నాయి. ఇతరులతో ప్రతి విషయంలోనూ ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. అనవసర పరిచయాలు కలుగుతాయి. సంబంధాలు బెడిసికొడతాయి. తోబుట్టువులతో ఆస్తి, ఆర్థిక వివాదాలు తలెత్తు తాయి. ముఖ్యమైన ప్రయత్నాల్లో బాగా తిప్పట ఉంటుంది. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం మంచిది.

కన్య

ఈ రాశిలో శుక్రుడు నీచబడడం వల్ల కుటుంబంలో సమస్యలు తలెత్తుతాయి. వివాదాలు, విభే దాలు, అపార్థాలు ఎక్కువగా ఉంటాయి. వ్యవహార శైలి వల్ల ఇబ్బందులు కలుగుతాయి. ఆదాయం ఆశించిన స్థాయిలో వృద్ధి చెందకపోవచ్చు. ఆర్థిక ప్రయత్నాల్లో శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువగా ఉంటుంది. ఉద్యోగంలో ప్రాధాన్యం, ప్రాభవం తగ్గుతాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు మందగి స్తాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో ఆశాభంగాలు ఎక్కువగా ఉంటాయి. ఖర్చులు పెరుగుతాయి.

తుల

రాశ్యధిపతి శుక్రుడు వ్యయ స్థానంలో నీచబడడం వల్ల ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. అనుకోని ఖర్చులు, వృథా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. అనవసర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. దుర్వార్తలు ఎక్కువగా వింటారు. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు నిరుత్సాహం కలిగిస్తాయి. ముఖ్యమైన ప్రయత్నాలు ఒక పట్టాన ముందుకు సాగక ఇబ్బంది పడతారు. దాంపత్య జీవితం సవ్యంగా సాగదు. సుఖ సంతోషాలు, మనశ్శాంతి తగ్గుతాయి. అనారోగ్యం ఇబ్బంది పెడుతుంది.

కుంభం

ఈ రాశికి అష్టమ స్థానంలో శుక్రుడి నీచ సంచారం వల్ల ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది. వైద్య ఖర్చులు పెరుగుతాయి. ఆదాయ ప్రయత్నాలు ఆశాభంగం కలిగిస్తాయి. కుటుంబ జీవితం, దాంపత్య జీవితం అనుకూలంగా, సంతృప్తికరంగా సాగకపోవచ్చు. బంధుమిత్రులతో వివాదాలు, విభేదాలు తలెత్తుతాయి. పిల్లల వల్ల సమస్యలు ఏర్పడతాయి. ప్రయాణాల్లో ఇబ్బందులు పడ తారు. జీవిత భాగస్వామి అనారోగ్యంతో బాధపడడం జరుగుతుంది. ఆదాయం బాగా తగ్గుతుంది.

మీనం

ఈ రాశికి సప్తమ స్థానంలో శుక్రుడి బలహీన సంచారం వల్ల వైవాహిక జీవితంలో ఒడిదుడుకులు ప్రారంభం అవుతాయి. దాంపత్య జీవితంలో సుఖసంతోషాలు తగ్గుతాయి. అనవసర పరిచయాలు పెరుగుతాయి. పెళ్లి ప్రయత్నాలు బాగా నిరుత్సాహం కలిగిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీతో పాటు రాబడి బాగా తగ్గుతుంది. ఉద్యోగంలో అధికారుల విమర్శలు, వేధింపులు ఎక్కువగా ఉండ వచ్చు. ఆస్తి, ఆర్థిక వ్యవహారాల్లో మిత్రుల వల్ల మోసపోవడం లేదా నష్టపోవడం జరుగుతుంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *