ప్రస్తుతం ఓటీటీల్లో సరికొత్త సినిమాలు మంచి రెస్పాన్స్ అందుకుంటున్నాయి. అలాగే వెబ్ సిరీస్ సైతం ఆకట్టుకుంటున్నాయి. ఇదిలా ఉంటే.. కొన్ని రోజుల క్రితం ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జియో హాట్ స్టార్ లో సూపర్ హిట్ అయిన ఓ వెబ్ సిరీస్ మూడవ సీజన్ ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. మనం మాట్లాడుకుంటున్న వెబ్ సిరీస్ పేరు ‘హార్ట్ బీట్’. అవును.. మొన్నటి వరకు జెన్ జీ యువతకు పిచ్చెక్కించిన వెబ్ సిరీస్ ఇది. ఇప్పటికే ఈ సిరీస్ ఒకటి, రెండు సీజన్స్ సూపర్ హిట్స్ కాగా.. మూడవ సీజన్ కోసం వేయి కళ్లతో ఎదురుచూశారు. అనేక రోజుల సస్పెన్స్ తర్వాత ఇప్పుడు ఎట్టకేలకు ఈ సిరీస్ అడియన్స్ ముందుకు వచ్చింది. ఇప్పుడు ఈ సిరీస్ జియో హట్ స్టార్ లో అందుబాటులో ఉంది. అయితే ఈ సిరీస్ లోని ప్రతి పాత్రకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ మూడవ సీజన్‌లో కొన్ని పాత్రలు లేవనే విషయం అభిమానులను షాక్‌కు గురి చేసింది. వారి స్థానంలో కొత్త వ్యక్తులను పరిచయం చేశారు.
ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ అయిన తేజు పాత్ర పోషించిన నటి యోగలక్ష్మి… తాను మూడవ సీజన్ లో కనిపించనని గతంలోనే ప్రకటించారు. , హార్ట్‌బీట్ – సీజన్ 3లో అనిత పాత్ర పోషించిన పడిని కుమార్ , నవీన్ పాత్ర పోషించిన అర్గిరామ్, ఈ కొత్త సీజన్‌లో తాము కొనసాగబోమని ప్రకటించారు. పడిని కుమార్ తన ఇన్ స్టాలో “రెండు సీజన్లు. లెక్కలేనన్ని జ్ఞాపకాలు. నేను ఎప్పటికీ గుర్తుంచుకునే పాత్ర. ‘హార్ట్‌బీట్’లో నాకు అనిత పాత్ర ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఈ ప్రయాణాన్ని ఇంత ప్రత్యేకంగా చేసిన నటీనటులు, సాంకేతిక నిపుణులు , అభిమానులందరికీ ధన్యవాదాలు. ఇది అనితకు వీడ్కోలు కావచ్చు, కానీ ఆమె జ్ఞాపకాలు నాతో ఎప్పటికీ ఉంటాయి” అంటూ రాసుకొచ్చారు. అలాగే అర్గిరామ్ తన ఇన్ స్టాలో “డాక్టర్ నవీన్ ‘హార్ట్‌బీట్’ వెబ్ సిరీస్‌కు వీడ్కోలు పలుకుతున్నారు, మీలాగే నేను కూడా గురువారం ఎపిసోడ్‌ల కోసం ఎదురుచూస్తున్నాను” అని పేర్కొన్నారు.
‘హార్ట్‌బీట్’ సిరీస్‌లో గుణ పాత్ర పోషించిన సర్వ కూడా మూడవ సీజన్‌లో కొనసాగడం లేదని వెల్లడైంది. అయితే ఇప్పుడు ఈ సిరీస్ మూడవ సీజన్ లో ప్రేక్షకులకు ఇష్టమైన పాత్రలు ఉండడం లేదని తెలుస్తోంది. ముఖ్యంగా గుణ, అనితా, తేజు పాత్రలు మిస్ కావడం అంటే ప్రేక్షకులకు సరైన ఎంటర్టైన్మెంట్ దూరమైనట్లే అంటున్నారు.
ఎక్కువ మంది చదివినవి : Cinema OTT: కేవలం నలుగురు మనుషులు.. ప్రతి సీన్ భయానకం.. ఈఓటీటీలో ఈ థ్రిల్లర్ మూవీ సంచలనం..
ఎక్కువ మంది చదివినవి : Tollywood : ఆ ఇద్దరూ హీరోలకు తల్లిగా అస్సలు నటించను.. సీనియర్ నటి శరణ్య..