Headlines

Tollywood: అప్పట్లో కుర్రాళ్ల కలల రాణి.. ఇప్పుడు 5 కంపెనీలకు యజమాని.. 2000 కోట్ల ఆస్తులు..

Tollywood: అప్పట్లో కుర్రాళ్ల కలల రాణి.. ఇప్పుడు 5 కంపెనీలకు యజమాని.. 2000 కోట్ల ఆస్తులు..


ఒకప్పుడు 90వ దశకం కుర్రాళ్ల కలల రాణి. 15 ఏళ్ల వయసులో సినీరంగంలోకి అడుగుపెట్టిన ఈ అమ్మడు.. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషలలో స్టార్ హీరోలతో అనేక హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. 1992లో సూపర్ హిట్ చిత్రంతో ఆమె కెరీర్ మారిపోయింది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ? తనే హీరోయిన్ రంభ. వినీత్ సరసన సర్గం సినిమాతో కథానాయికగా పరిచయమైంది. 1993లో రాజేంద్ర ప్రసాద్ జోడిగా ఆ ఒక్కటి అడక్కు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. దక్షిణాదిలో వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంటూ తక్కువ సమయంలోనే విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. సినిమాల్లో హీరోయిన్ గానే కాకుండా స్పెషల్ పాటలతో అదరగొట్టింది. అప్పట్లోనే గ్లామర్ ప్రపంచంలో ఓ వెలుగు వెలిగింది.

అల్లు అర్జున్ నటించిన దేశ ముదురు సినిమాలో స్పెషల్ పాటతో రచ్చ చేసింది. చివరిగా ‘పెన్ సింగం’ చిత్రంలో నటించిన రంభ, 2010లో కెనడియన్ వ్యాపారవేత్త ఇంద్రకుమార్ పద్మనాభన్‌ను వివాహం చేసుకుని విదేశాల్లో స్థిరపడింది. ఆమెకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. పెళ్లి తర్వాత చాలా కాలం గ్యాప్ తీసుకున్న రంభ.. ఇప్పుడిప్పుడే సోషల్ మీడియా ప్రపంచంలో యాక్టివ్ గా ఉంటుంది. మరోవైపు బుల్లితెరపై పలు రియాల్టీ షోలలో సందడి చేస్తుంది. 2017లో విజయ్ టీవీలో ప్రసారమైన ‘కింగ్ ఆఫ్ జూనియర్’ షోలో ఆయన న్యాయనిర్ణేతగా పాల్గొంది. ఇదిలా ఉంటే.. టీవీతోపాటు అటు సినిమాల్లోనూ రంభ రీఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఒక ఫిల్మ్ ఫెస్టివల్‌కు హాజరైన నిర్మాత థాను, వేదికపై రంభ గురించి ప్రస్తావిస్తూ, “రంభకు 2000 కోట్ల రూపాయల విలువైన ఆస్తి ఉంది. ఆమె భర్త ఒక పెద్ద వ్యాపారవేత్త. రోజుల క్రితం రంభ భర్త నా దగ్గరకు వచ్చి, ఆమెకు సినిమాల్లో మళ్లీ అవకాశం ఇవ్వమని అడిగారు. దానికోసం సినిమా చేయకండి. మంచి కంపెనీ చూసి నేనే స్వయంగా చెబుతాను,” అని కలైపులి థాను పేర్కొన్నారు.

రంభ భర్త ఇంద్రకుమార్ పద్మనాభన్ ఒక పెద్ద వ్యాపారవేత్త. ఆయన కెనడాలో నివసిస్తూ అనేక కంపెనీలను నడుపుతున్నారు. ఇంటీరియర్ డిజైనర్ గా పేరుగాంచిన ‘మ్యాజిక్ వుడ్స్’ అనే కంపెనీకి ఇంద్రకుమార్ డైరెక్టర్‌గా ఉన్నారు. ఈ కంపెనీ మాత్రమే కాకుండా, రంభ పేరు మీద ఉన్న కంపెనీతో కలిపి ఇంద్రకుమార్ మొత్తం 5 కంపెనీలను నడుపుతున్నారు. ఈ కంపెనీలలో కొన్ని చెన్నైలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయనేది గమనార్హం.

ఎక్కువ మంది చదివినవి : Cinema OTT: కేవలం నలుగురు మనుషులు.. ప్రతి సీన్ భయానకం.. ఈఓటీటీలో ఈ థ్రిల్లర్ మూవీ సంచలనం..

రంభ పోస్ట్..

ఎక్కువ మంది చదివినవి : Tollywood : ఆ ఇద్దరూ హీరోలకు తల్లిగా అస్సలు నటించను.. సీనియర్ నటి శరణ్య..





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *