Headlines

Sarpanch Post: అంజన్న గుడి కోసం సర్పంచ్ పదవికి వేలం.. ఎంత ధర పలికిందంటే?


Sarpanch Post: అంజన్న గుడి కోసం సర్పంచ్ పదవికి వేలం.. ఎంత ధర పలికిందంటే?

సాధారణంగా ఎన్నికలంటే పోటీలు.. ప్రచారాలు.. రాజకీయ విభేదాలు.. కానీ కర్నూలు జిల్లాలోని ఓ గ్రామంలో మాత్రం సీన్ రివర్స్. పదవుల కోసం పోటీ పడాల్సిన చోట.. ఊరి అభివృద్ధి కోసం పోటీపడ్డారు. సర్పంచ్ పదవిని ఏకంగా రూ.21 లక్షలకు వేలం వేశారు. ఆ డబ్బుతో ఆలయాలను అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. రాజకీయాలకు అతీతంగా గ్రామమంతా ఒక్కటై తీసుకున్న ఈ నిర్ణయం వెనుక ఉన్న అసలు కథేంటో చూద్దాం..

సర్పంచ్ పదవికి రూ.21 లక్షల వేలం

కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం పుట్టపాశం గ్రామంలో సర్పంచ్ పదవికి నిర్వహించిన వేలం పాట ఆసక్తికరంగా మారింది. రాజకీయాలకు అతీతంగా గ్రామస్థులంతా ఒక్కటై ఆంజనేయస్వామి ఆలయ ప్రాంగణంలో వేలం నిర్వహించారు. సర్పంచ్ పదవికి ఇద్దరు పోటీపడగా.. రూ.15 లక్షలతో ప్రారంభమైన వేలం చివరకు రూ.21 లక్షలకు చేరింది. గ్రామానికి చెందిన బోయ తలారి తిమ్మగురుడు తన భార్య బీటీ లలితమ్మ పేరుతో రూ.21 లక్షలు చెల్లించేందుకు ముందుకు రావడంతో రవిరెడ్డి పోటీ నుంచి తప్పుకున్నారు.

దీంతో తిమ్మగురుడు కుటుంబం నుంచి మాత్రమే నామినేషన్ దాఖలు చేయాలని గ్రామ పెద్దలు నిర్ణయించారు. తద్వారా సర్పంచ్ పదవిని ఏకగ్రీవం చేసేందుకు తీర్మానించారు. వేలం ద్వారా వచ్చే రూ.21 లక్షలతో సుంకులమ్మ, పెద్దమ్మ ఆలయాలను అభివృద్ధి చేయాలని నిర్ణయించారు.

గ్రామాభివృద్ధికి ప్రభుత్వ నిధులు

మరోవైపు ఏకగ్రీవంగా ఎన్నికయ్యే పంచాయతీలకు ప్రభుత్వం అందించే రూ.10 లక్షల ప్రోత్సాహక నిధులతో గ్రామంలో సీసీ రోడ్లు, తాగునీటి పథకాలను అభివృద్ధి చేస్తామని గ్రామ పెద్దలు చెబుతున్నారు. ఇలా రాజకీయాలకు అతీతంగా గ్రామస్థులంతా కలిసికట్టుగా తీసుకున్న నిర్ణయం స్థానికంగా ఆసక్తికరంగా మారింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *