Headlines

పేద విద్యార్థుల కోసం కిషన్ రెడ్డి మంచి మనసు.. వేలాది మంది టెన్త్ పరీక్షా ఫీజులు స్వయంగా చెల్లింపు!


హైదరాబాద్: ఆర్థిక ఇబ్బందులు ఏ ఒక్క పేద విద్యార్థి చదువుకు ఆటంకం కాకూడదనే సదుద్దేశంతో కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి మరోసారి తన పెద్ద మనసును చాటుకున్నారు. సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి చదువుతున్న పేద విద్యార్థులకు అండగా నిలుస్తూ, వారందరి పరీక్షా ఫీజులను స్వయంగా చెల్లించి తన మానవతా దృక్పథాన్ని చాటుకున్నారు .

విద్యాభివృద్ధితోనే సమాజ వికాసం సాధ్యమని బలంగా విశ్వసించే కిషన్ రెడ్డి.. గత కొన్ని సంవత్సరాలుగా సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని పేద విద్యార్థుల చదువుకు ఏటా బాసటగా నిలుస్తున్నారు. ఇందులో భాగంగానే, నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న మొత్తం 87 ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 4,741 మంది పదో తరగతి విద్యార్థుల పరీక్షా ఫీజులను ఆయన పూర్తిగా భరించారు. తల్లిదండ్రులపై ఆర్థిక భారం పడకుండా, విద్యార్థులు ఎలాంటి మానసిక ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా పరీక్షలపై దృష్టి సారించేందుకు ఆయన తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

అంగన్వాడీల నుంచి ప్రభుత్వ పాఠశాలల వరకు మౌలిక వసతుల కల్పనకు కృషి..!

గతంలో అంబర్‌పేట ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచే విద్యా రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న కిషన్ రెడ్డి, ప్రస్తుతం సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల బలోపేతంపై ప్రత్యేక దృష్టి సారించారు. సికింద్రాబాద్ నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలలోని పేద విద్యార్థులకు బూట్లు (షూస్), దుస్తులు, నోట్‌బుక్స్ అందించడంతో పాటు పాఠశాలల్లో బెంచీలు, తాగునీటి సౌకర్యం, మరుగుదొడ్ల నిర్మాణం, వాటి పరిశుభ్రత కోసం టాయిలెట్ క్లీనింగ్ మిషన్లు వంటి ఆధునిక మౌలిక వసతులను కల్పనకు కృషి చేస్తున్నారు. అంతేకాకుండా, చిన్నారుల ప్రాథమిక విద్యకు పునాది అయిన అంగన్వాడీ కేంద్రాలను సైతం ఆహ్లాదకరమైన, ఆధునిక వసతులతో తీర్చిదిద్దుతూ పేద విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు ఆయన అండగా నిలుస్తున్నారు.

పేద విద్యార్థులకు పరీక్షా ఫీజులు చెల్లించి, ఇటు పాఠశాలల్లో మౌలిక వసతులను మెరుగుపరుస్తూ పేద విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు కిషన్ రెడ్డి నిరంతరం అండగా నిలుస్తున్నారు. ఆయన చూపిస్తున్న ఈ ఆదరణ, సేవా తత్పరత ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలుస్తోందని స్థానిక ప్రజలు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు హర్ష్యం వ్యక్తం చేస్తున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *