జగిత్యాల జిల్లాలో ఓ దొంగ.. పోలీసులను ఉరుకులు పరుగులు పెట్టించాడు. సినిమా స్టైల్లో ప్రధాన రహదారిపై దొంగా పోలీస్ ఆట సాగింది. రోడ్డుపై ఛేజింగ్ సీన్ చూసి.. వాహనదారులు కూడా హడలిపోయారు. ఇంతకీ ఏం జరిగిందో.. ఆ ఛేజింగ్ సీన్ ఏంటో ఇప్పుడు చూద్దాం. జగిత్యాల జిల్లా కోరుట్లలో ఆర్టీసీ బస్సునే చోరీ చేశాడు దొంగ. కోరుట్ల బస్టాండ్‌లో ప్లాట్‌ఫామ్‌పై పార్క్‌చేసిన బస్సును ఎత్తుకెళ్లిపోయాడు. కల్లూర్ వెళ్లడం కోసం బస్సును సిద్ధంగా ఉంచి, డ్రైవర్ టీ తాగేందుకు వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగింది. వెంటనే గుర్తించిన ఆర్టీసీ డ్రైవర్.. అధికారులకు సమాచారం ఇవ్వడంతో.. బస్సున ఆపేందుకు మూడు వాహనాల్లో ఛేజ్ చేశారు పోలీసులు. అయితే, మద్యం మత్తులో ఉన్న దొంగ.. అతివేగంగా దూసుకెళ్తూ రోడ్డుపై బీభత్సం సృష్టించాడు. బస్సు ఆపాలని పోలీసులు హెచ్చరిస్తూ.. సైరన్ వేస్తున్నా ఆపకుండా తీసుకెళ్లాడు. పోలీసులు వెంటాడుతుండటంతో కంగారుపడ్డ దొంగ.. మరింత వేగంగా బస్సును నడుపుతూ తప్పించుకునే ప్రయత్నం చేశాడు. అలా తప్పించుకునే క్రమంలో రోడ్డుపై బైక్‌ను ఢీకొట్టాడు. దాంతో, ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. చివరికి, మెట్‌పల్లి శివార్లలోని గండి హనుమాన్ దేవాలయం దగ్గర లారీని ఢీకొట్టి ఆగిపోయింది బస్సు. బస్సు ఆగిన వెంటనే పారిపోయే ప్రయత్నం చేశాడు దొంగ. అయితే, అప్పటికే చుట్టుముట్టిన పోలీసులు.. దొంగను పట్టుకుని మెట్‌పల్లి పోలీస్‌స్టేషన్‌కి తరలించారు. బస్సును ఆర్టీసీ డిపోకి తరలించి మరమ్మతులు చేపట్టారు. అయితే, దొంగ చేసిన పనికి పోలీసులు ఉరుకుగులు పరుగులు పెట్టాల్సి వచ్చింది. బస్సును ఆపేందుకు నానా తిప్పలు పడాల్సి వచ్చింది. బస్టాండ్ నుంచే బస్సును ఎత్తుకెళ్లిపోవడంతో ఆర్టీసీ అధికారులు కూడా హైరానా పడ్డారు. అయితే, ఎందుకు బస్సును ఎత్తుకెళ్లాడు? మద్యం మత్తులోనే అలా చేశాడా? లేక మరేదైనా కారణం ఉందా అని ఎంక్వైరీ చేస్తున్నారు పోలీసులు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఘాటెక్కిన వంటిల్లు..భగ్గుమంటున్న నిత్యావసర సరుకుల ధరలు
Viral Video: గడ్డికోస్తున్న గొర్రెలు.. ఎక్కడంటే ?
వైన్స్‌లోకి దూసుకొచ్చిన చిరుత.. క్షణాల్లో అక్కడి వ్యక్తిని..
రిటైర్మెంట్ పొదుపు కోసం ఏది బెస్ట్ ?? మీకు సరిపోయే పొదుపు పథకం ఏది?
Auto Driver Love: నెటిజన్లను కదిలిస్తున్న ఆటోడ్రైవర్ ప్రేమకథా చిత్రం!