డార్క్ చాక్లెట్ అనగానే కేవలం ఒక రుచికరమైన తీపి పదార్థం అనుకుంటే పొరపాటే! కనీసం 70 శాతం కోకో ఉన్న డార్క్ చాక్లెట్ ఆరోగ్యానికి eఎంతో మేలు చేస్తుందని శాస్త్రీయంగా నిరూపించబడింది. క్రమం తప్పకుండా మితంగా డార్క్ చాక్లెట్ తీసుకోవడం వల్ల చర్మ కాంతి పెరుగుతుంది. మానసిక ఒత్తిడి తగ్గి మూడ్ మెరుగుపడుతుంది. రోజువారీ ఆహారంలో సరైన పరిమాణంలో భాగం చేసుకుంటే ఇది శరీరానికి ఒక సహజమైన ఆరోగ్య బూస్టర్‌గా పనిచేస్తుంది. మరిన్ని లాభాలేంటో ఇక్కడ చూద్దాం..
గుండె ఆరోగ్యానికి రక్షణ: డార్క్ చాక్లెట్లో పాలీఫెనాల్స్, కాటెచిన్స్, ఫ్లేవనాయిడ్లు అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలోని హానికర ఫ్రీ రాడికల్స్‌తో పోరాడి కణాల నష్టాన్ని నివారిస్తాయి. ఇందులోని ఫ్లేవనాయిడ్లు ధమనులను ఆరోగ్యంగా ఉంచి, రక్తం గడ్డకట్టే ప్రమాదాన్ని తగ్గిస్తాయి. క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల గుండెపోటు, పక్షవాతం వచ్చే అవకాశాలు తగ్గుతాయి.
రక్తపోటు నియంత్రణ: కోకోలో ఉండే సమ్మేళనాలు రక్తనాళాల లైనింగ్‌ను ఉ ఉత్తేజపరిచి నైట్రిక్ ఆక్సైడ్ వాయువును ఉత్పత్తి చేస్తాయి. ఇది రక్తనాళాలను సడలించి, రక్తపోటును అదుపులో ఉంచడానికి సహాయపడుతుంది. డార్క్ చాక్లెట్ మెదడుకు రక్తప్రసరణను పెంచుతుంది. దీనివల్ల జ్ఞాపకశక్తి, ఏకాగ్రత, మానసిక చురుకుదనం పెరుగుతాయి. వయస్సు పెరిగేకొద్దీ వచ్చే జ్ఞాపకశక్తి సమస్యలను అరికట్టడంలో ఇది ఉపయోగపడుతుంది.
చర్మ రక్షణ, మూడ్ బూస్టర్: డార్క్ చాక్లెట్‌లోని యాంటీఆక్సిడెంట్లు చర్మానికి సూర్యుని హానికర అతినీలలోహిత కిరణాల నుండి సహజ రక్షణను అందిస్తాయి. ఇది చర్మానికి రక్తప్రసరణను పెంచి, తేమను అందించి చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది. ఇది మెదడులో ఎండోర్ఫిన్లు, సెరటోనిన్ వంటి హ్యాపీ హార్మోన్ల విడుదలను ప్రేరేపిస్తుంది. దీనివలన ఆందోళన, డిప్రెషన్ తగ్గి మానసిక ఉల్లాసం లభిస్తుంది.
కొలెస్ట్రాల్ సమతుల్యత: డార్క్ చాక్లెట్ శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ఆక్సీకరణ చెందకుండా అడ్డుకుంటుంది. మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచడంలో సహాయపడుతుంది. డార్క్ చాక్లెట్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసినప్పటికీ, ఇందులో కేలరీలు ఉంటాయి. కాబట్టి, గరిష్ట ప్రయోజనాల కోసం ప్రతిరోజూ 20 నుండి 30 గ్రాముల పరిమాణంలో మాత్రమే తీసుకోవడం శ్రేయస్కరం.




